E-Paper
Advertisement

Mahesh Kumar Goud: రెండేళ్లలో 80వేల ఉద్యోగాలిచ్చాం.. ఇది ప్రజా పాలన అంటే.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: రెండేళ్లలో 80వేల ఉద్యోగాలిచ్చాం.. ఇది ప్రజా పాలన అంటే.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Advertisement

Mahesh Kumar Goud: మొదటి విడుత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి స్పష్టమైన నిదర్శనమని పీసీసీ చీఫ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సుమారు 2 వేల పైచిలుకు స్థానాలు (62% పైగా) గెలుపొందారని వెల్లడించారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషికి దక్కిన ఫలితమని..  గెలిచిన సర్పంచ్ అభ్యర్థులందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

Advertisement

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాల అమలు పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారని తెలిపారు. ప్రజలు సంతృప్తిగా ఉండబట్టే తమ పార్టీ మద్దతుదారులకు పట్టం కట్టారని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నిదకల ఫలితాలు తమపై, ముఖ్యమంత్రిపై మరింత బరువు, బాధ్యత పెంచాయని, మరింత మెరుగైన పాలన అందించడానికి కృషి చేస్తామని అన్నారు.

ఉద్యోగ కల్పన విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఆయన ఎండగట్టారు. ‘10 ఏళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు. కానీ, మేము కేవలం రెండేళ్లలోనే 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం’  అని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, వికాసం వైపు వేగంగా పయనిస్తోందని, రాష్ట్ర నాయకత్వంపై ప్రజలకు, పెట్టుబడిదారులకు నమ్మకం పెరిగిందని ఆయన భరోసా వ్యక్తం చేశారు.

Advertisement

ప్రతిపక్షాలు నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. ప్రజలు వారి మాటలను విశ్వసించడం లేదని గౌడ్ గారు విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని చోట్ల బీఆర్‌ఎస్-బీజేపీ కలిసి పోటీ చేసినా, ప్రజలు వారిని తిరస్కరించారని తెలిపారు. మొదటి విడుత సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ-బీఆర్‌ఎస్ కూటమికి కలిపి కూడా 25% ఓట్లు రాలేదని గణాంకాలను ఉటంకించారు.

మరోవైపు, రాష్ట్రంలో జరిగిన ఓటు చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా ఉందని  తెలిపారు. 10 నుండి 12 లక్షల ఓట్ల చోరీకి సంబంధించిన సంతకాల సేకరణ పూర్తయిందని, వీటిని ఢిల్లీకి పంపిస్తున్నామని ఆయన వెల్లడించారు. డిసెంబర్ 14న రాంలీలా మైదానంలో ఓటు చోరీపై జరిగే మహా ధర్నాలో పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ పాల్గొంటారని ఆయన ప్రకటించారు. పెట్టుబడుల విషయంలో గత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన గురించి బీజేపీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తూ, కేవలం విమర్శల కోసమే బీజేపీ ఈరోజు మాట్లాడుతోందని విమర్శించారు.

ALSO READ: CM Chandrababu: మరోసారి హస్తినకు చంద్రబాబు.. కేంద్రమంత్రులతో సమావేశం.. ఎందుకంటే?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×