// //

హైదరాబాద్‌లో వాటర్ సప్లై బంద్ కానుంది. మంజీరా వాటర్ సప్లై ఫేజ్ 2 పనుల కారణంగా నగరంలో రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. అసలే అంతంత మాత్రంగా వచ్చే వాటర్.. అసలే రావంటే జనాలు ఉలిక్కిపడుతున్నారు.
ఈ నెల 19వ తేదీ ఉదయం నుంచి.. 20వ తేదీ మధ్యాహ్నం వరకు.. మంజీరా వాటర్ పైప్ లైన్ కనెక్షన్లు ఆఫ్ చేయనున్నారు జలమండలి అధికారులు. దీంతో దాదాపు 30 ప్రాంతాల్లో పాక్షికంగా కానీ పూర్తిగా కానీ టాప్ వాటర్ నిలిచిపోనుంది.
నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు ఇవే:
బీరంగూడ, అమీన్‌పూర్, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారాం, దీప్తి శ్రీనగర్, మదీనాగూడ, మియాపూర్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్టలో వాటర్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్, అమీర్ పేట్ తదితర ప్రాంతాల్లో వాటర్ సప్లైకి పాక్షిక అంతరాయం కలగనుంది.