E-Paper
Advertisement

MLC Teenmar Mallana Oath: ‘తీన్మార్ మల్లన్న అనే నేను..’ ఎమ్మెల్సీగా ప్రమాణం..

MLC Teenmar Mallana Oath: ‘తీన్మార్ మల్లన్న అనే నేను..’ ఎమ్మెల్సీగా ప్రమాణం..
Advertisement

MLC Teenmar Mallana Oath: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని కౌన్సిల్ ఛైర్మన్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.

తీన్మార్ మల్లన్నతో కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ దీపా దాస్ మున్షి హాజరయ్యారు.

Advertisement

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిపై ఎలిమినేషన్ పద్థతిలో విజయం సాధించారు.

కాగా గతంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నియెజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీకి బైపోల్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Also Read: సంచలన వ్యాఖ్యలు చేసిన రఘునందన్ రావు.. కేసీఆర్‌పై కేసు నమోదు..?

ఖమ్మం-నల్గొండ- వరంగల్ పట్టభద్రుల ఎమెల్సీ బైపోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగు రాకేశ్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి, ఇండిపెండెంట్లుగా కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్, పాలకూరి అశోక్ సహా 52 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. దీంతో హోరాహోరి పోరులో తీన్మార్ మల్లన్న ఎలిమినేషన్ పద్ధతిలో విజయం సాధించారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×