E-Paper
Advertisement

మిర్యాలగూడ బస్టాండ్‌లో ఏసీబీ ఉచ్చు.. దొరికిపోయిన వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్!

మిర్యాలగూడ బస్టాండ్‌లో ఏసీబీ ఉచ్చు.. దొరికిపోయిన వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్!
Advertisement

Bribery Case: స్వేచ్ఛ బ్యూరో: వక్ఫ్ బోర్డు రికార్డుల్లో ల్యాండ్‌ను నమోదు చేసే విషయమై లంచం తీసుకుంటున్న నల్గొండ వక్ఫ్ బోర్డు ఇన్స్ స్పెక్టర్ షేక్ మహమూద్‌ను శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ వక్ఫ్ బోర్డు పరిధిలో ఇన్స్ స్పెక్టర్ మహమూద్ పెద్దవూర మండల కేంద్రంలో గల జామె మసీద్ అబూబకర్ సిద్ధిఖ్ రెహమతుల్లా అలాయ్ ఆస్తిని వక్ఫ్ బోర్డు రికార్డుల్లో నమోదు చేయాలని ఓ వ్యక్తి గతేడాది ఫిబ్రవరి 25న వక్ఫ్ బోర్డు కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు.

రూ.10వేలు డిమాండ్..

దీనికి సంబంధించి నివేదికను హైదరాబాద్ వక్ఫ్ బోర్డు సీఈవోకు పంపించాల్సి ఉంటుంది.దీనికి గాను నల్గొండ జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్ స్పెక్టర్ మహమూద్ రూ.10వేల లంచాన్ని డిమాండ్ చేశాడు. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడతో ఏసీబీ అధికారుల సూచనల మేరకు మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Advertisement

Also read: Jagga Reddy: ఆధార్ కార్డు ఇస్తే చాలు.. మీ ఇంటికి సైకిల్ వస్తుంది: జగ్గారెడ్డి!

ఏసీబీ అధికారులు సోదాలు..

అతని నుంచి రూ.10వేల లంచం సొమ్మును స్వాదీనం చేసుకున్నారు. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలోని మందుల వారి కాలనీలో వక్ఫ్ బోర్డు ఇన్స్ స్పెక్టర్ షేక్ మహమూద్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మహమూద్‌ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కోసం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ పేర్కొన్నారు.

Advertisement

Also read: ఇంగ్లీష్ ఇర‌గ‌దీసిన రేవంత్‌! త‌డ‌బ‌డ‌కుండా.. సూటిగా! పాల‌న‌పై త‌న‌దైన మార్కును వివ‌రించిన సీఎం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×