E-Paper
Advertisement

కల్తీ పెరుగు గుట్టు రట్టు.. తప్పును ఓప్పుకొని క్షమాపన చెప్పిన డైరీ ఓనర్!

కల్తీ పెరుగు గుట్టు రట్టు.. తప్పును ఓప్పుకొని క్షమాపన చెప్పిన డైరీ ఓనర్!
Advertisement

Dairy Adulteration: స్వేచ్ఛ బ్యూరో: డైరీ లో జరుగుతున్న కల్తీ ని వార్తలు రూపంలో రాసిన విలేకరులపై అసత్య ఆరోపణలు చేసిన వి ఎల్ ఆర్ డెయిరీ యజమాని నెల్లి ప్రవీణ్ తన తప్పును ఒప్పుకున్నా రు. హుజూరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో పట్టణ సీఐ కరుణాకర్ సమక్షంలో వి ఎల్ ఆర్ డెయిరీ యజమాని నెల్లి ప్రవీణ్. జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు.

ల్యాబ్ నివేదికలో నాణ్యత లోపం నిరూపణ

సైదాపూర్ రోడ్డులోని వి ఎల్ ఆర్ డెయిరీలో సాగుతున్న కల్తీ వ్యాపారంపై పత్రికల్లో కథనాలు రావడంతో ఆహార భద్రతా అధికారులు దాడులు చేసి పెరుగు నమూనాలను సేకరించారు. హైదరాబాద్‌ స్టేట్ ఫుడ్ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలో సదరు పెరుగు ‘సబ్‌స్టాండర్డ్’ (నాణ్యత లేనిది) అని, తేలింది.

Advertisement

Also Read: Mining Course: సీఎం రేవంత్‌కు మంత్రి పొన్నం లేఖ..!

స్టేషన్‌లో తేలిన పంచాయితీ..

కల్తీ గుట్టు బయటపడటంతో డెయిరీ యజమాని విలేకరులపై బురదజల్లే ప్రయత్నం చేశారు. జర్నలిస్టులు తనను డబ్బులు డిమాండ్ చేశారంటూ డెయిరీ ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిపై విలేకరుల యూనియన్ ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేస్తామనడంతో.. యజమాని వెనక్కి తగ్గారు.వెంటనే డైరీ ముందు ఫ్లెక్సీ నీ తొలగించారు. ల్యాబ్ రిపోర్టులో తప్పు రుజువు కావడం, విలేకరులపై తప్పుడు ఆరోపణలు చేయడం తన పొరపాటేనని అంగీకరిస్తూ, సీఐ ఎదుట విలేకరులకు క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది.

Advertisement

Also Read: ఢిల్లీ పీఠాన్ని శాసిస్తున్న ప్రాంతీయ శక్తులు.. కింగ్ మేకర్ల చేతిలో జాతీయ పార్టీల జాతకం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×