E-Paper
Advertisement

Vijayashanthi: రేవంత్ సర్కార్‌పై రాములమ్మ మాట

Vijayashanthi: రేవంత్ సర్కార్‌పై రాములమ్మ మాట
Advertisement

Vijayashanthi latest Tweet(Congress news telangana):  తెలంగాణ రాములమ్మ ఎక్కడ? అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆమె ఎక్కడున్నారు? లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నా, ఆమె ఎందుకు సైలెంట్ అయ్యారు? ప్రచారంలో ఎందుకు కనిపించలేదు? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామంది అభిమానులను వెంటాడాయి.. ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఆమెపై వస్తున్న రకరకాల వార్తల నేపథ్యంలో క్లారిటీ ఇచ్చేశారు విజయశాంతి.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు సోషల్‌మీడియా ద్వారా తెలిపారు కాంగ్రెస్ నేత విజయశాంతి. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి వర్గం.. ప్రజల కోసం ఆ దిశగా పని చేస్తున్నారని రాసుకొచ్చారు. ప్రభుత్వ కార్యాచరణ విజయం దిశగా సాగాలని మనసులోని మాటను బయటపెట్టారు. అలాగే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు.

Advertisement

ప్రభుత్వం వైపు కంటే.. ప్రజల వైపు ఉండటం తన ధోరణి అని కాంగ్రెస్ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. తిరుగుబాటు సినిమా పాత్రల ప్రేరణ ఇందుకు కారణం కావచ్చన్నారు. కొంతమంది విమర్శించినా ఎందుకో అదే విధానం తనను ముందుకు నడిపిస్తోందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నంత పోరాట స్ఫూర్తి, స్వేచ్ఛ అధికార పక్షంలో సాధ్యపడకపోవడం కూడా ఒక వాస్తవం ఏమోనని రాసుకొచ్చారు. మొత్తానికి రాములమ్మ మేసెజ్‌తో కౌంటర్లు వేసే వాళ్ల నోటికి తాళం పడినట్లైంది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×