E-Paper
Advertisement

Hyderabad: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు మరో ప్రమాదం.. చలిలో వణికిన ప్రయాణికులు

Hyderabad: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు మరో ప్రమాదం.. చలిలో వణికిన ప్రయాణికులు
Advertisement

Hyderabad: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులకు ప్రమాదాలు వరుసగా వెంటాడుతున్నాయి. ఇటీవల ఇదే ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఘోర ప్రమాదానికి గురైన ఘటన మరువకముందే, తాజాగా మరో బస్సు నడిరోడ్డుపై ప్రమాదకర స్థితిలో నిలిచిపోయింది.

హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న వేమూరి ట్రావెల్స్ బస్సు (నెంబర్ PY 04 A2542) పెద్ద అంబర్‌పేట్ ఫ్లైఓవర్ పైకి చేరుకోగానే టైర్ల నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. బస్సు ఇంజిన్ ఓవర్ హీట్ కావడంతో ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు. పొగలు రావడంతో భయాందోళనకు గురైన 26 మంది ప్రయాణికులు వెంటనే బస్సు దిగేశారు.

Advertisement

అయితే, తీవ్రమైన చలిలో ఫ్లైఓవర్ పైనే దాదాపు గంటకు పైగా ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రయాణికులు ఇంత ఇబ్బంది పడుతున్నా వేమూరి ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రమాదంతో వార్తల్లో నిలుస్తున్నా, యాజమాన్యం వాహనాల ఫిట్‌నెస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని ప్రయాణికులు మండిపడుతున్నారు. గత ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×