E-Paper
Advertisement

Petrol Bunks: ఉదయం నుంచే పెట్రోల్ బంకులకు వాహనాల క్యూ.. నో స్టాక్ బోర్డులు

Petrol Bunks: ఉదయం నుంచే పెట్రోల్ బంకులకు వాహనాల క్యూ.. నో స్టాక్ బోర్డులు
Advertisement

Petrol Bunks: కేంద్రం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ట్రక్కు డ్రైవర్లు నిరసన చేపట్టగా.. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా.. మంగళవారం నాడు పెట్రోల్ బంక్‌ల దగ్గర భారీ క్యూలైన్లు దర్శనం ఇచ్చాయి. పెట్రోల్‌, డీజిల్‌ దొరుకుతుందో లేదోనని ఒక్కసారిగా వాహనదారులు బంక్‌లకు భారీస్థాయిలో తరలివచ్చారు. అందరూ ట్యాంక్ ఫుల్ చేయించుకునేందుకే మొగ్గు చూపడంతో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల బంక్‌ల యజమానులు ‘నో స్టాక్‌’ బోర్డులు కూడా పెట్టేశారు.

అయితే ఈ ఎఫెక్ట్ బుధవారం కూడా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల వద్దకు వాహనదారులు చేరుకుంటున్నారు. బంక్ లు ఇంకా ఓపెన్ కాకముందే బైక్ లు, కార్లు వరుసగా కిలోమీటర్ల పొడవునా లైన్లలో ఉంచారు.

Advertisement

మరోవైపు కేంద్రం తరఫున హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ట్రక్కు డ్రైవర్లతో ఎట్టకేలకు మంగళవారం రాత్రికి ఫలించాయి. భారతీయ న్యాయ సంహితలోని నిబంధనలు ఇంకా అమలులోకి రాలేదని.. రవాణాదారుల సంఘాలతో విస్తృత చర్చలు జరిపిన తర్వాతే సెక్షన్‌ పై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దాంతో సమ్మె విరమిస్తున్నట్టు ఆలిండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 3 వేల 500 పెట్రోల్‌ బంకులు ఉండగా.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నిత్యం 50 లక్షల లీటర్ల డీజిల్‌.. 40 లక్షల లీటర్ల పెట్రోల్‌ విక్రయాలు జరుగుతుంటాయని సమాచారం.

.

Advertisement

.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×