E-Paper
Advertisement

కేటీఆర్.. ఇంకెంత కాలం తెలంగాణను పీక్కుతింటారు? విప్ వీరేశం సంచలనం

కేటీఆర్.. ఇంకెంత కాలం తెలంగాణను పీక్కుతింటారు? విప్ వీరేశం సంచలనం
Advertisement

Veeresham: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబం, పదేళ్లపాటు రాక్షస పాలన సాగించిందని ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్‌లో విడుదల చేసిన ఒక అధికారిక ప్రెస్ నోట్‌లో ఆయన బీఆర్‌ఎస్ గత వైఫల్యాలను, అరాచకాలను ఎండగట్టారు.

ఉద్యమకారుల బలిదానాలు.. దొంగ దీక్షలు!

Advertisement

తెలంగాణ ఉద్యమ సమయంలో అమాయక యువత ప్రాణాలను బలిగొన్న చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిదేనని వీరేశం ఆరోపించారు. ‘చేతిలో కిరోసిన్ డబ్బాలు చూపించి, ఉద్యమకారులను ఆత్మహత్యలకు పురికొల్పింది మీరే. దొంగ దీక్షలు చేస్తూ డ్రామాలతో తెలంగాణ బిడ్డలను వారి కుటుంబాలకు దూరం చేశారు. సోనియా గాంధీ కాళ్ల మీద పడి, వెనుక నుంచి వెన్నుపోటు పొడిచి రాజకీయం చేశారు’ అంటూ మండిపడ్డారు. సెంటిమెంట్‌తో గెలిచి, అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లిని గడీల మధ్య బందీ చేశారని విమర్శించారు.

Also Read: బీఆర్ఎస్ యాక్షన్.. కాంగ్రెస్ డైరెక్షన్! కాళేశ్వరంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

Advertisement

దళితులపై అరాచకాలు..

గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ‘కల్వకుంట్ల రాజ్యాంగం’ నడిచిందని వీరేశం ధ్వజమెత్తారు. నాడు హక్కుల కోసం పోరాడిన రైతులకు సంకెళ్లు వేసి నడిబజారులో నడిపించారని, నేరెళ్లలో దళితులకు కరెంట్ షాక్‌లు పెట్టించి తెలంగాణకు కాళరాత్రులను పరిచయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ చుట్టూ ముళ్లకంచెలు వేసి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని, కాసుల కక్కుర్తితో సిరుల తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.

రక్తచరిత్ర సృష్టించాలని చూస్తున్నారా?

ప్రజలు బుద్ధి చెప్పినా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేటీఆర్ కుట్రలు ఇంకా ఆగలేదని వీరేశం విమర్శించారు. పదేళ్లలో తాగిన రక్తంతో దాహం తీరలేదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం బ్యారేజీలు కొట్టుకుపోయి, అమాయకుల ప్రాణాలు గోదావరిలో కలవాలని చూస్తున్నారా? అని నిలదీశారు. రైతుల పేరు చెప్పి రాష్ట్రంలో మరోసారి రక్తచరిత్ర లిఖించాలని, ప్రజలను రెచ్చగొట్టి మళ్లీ రాక్షస పాలన తేవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చైతన్యం ముందు కేటీఆర్ ఇప్పటికే చరిత్రలో కలిసిపోయారని, ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోకపోతే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని వేముల వీరేశం హెచ్చరించారు.

Also Read: కమీషన్ ఇస్తేనే బిల్లులు.. కాంగ్రెస్ పాలనపై డీకే అరుణ షాకింగ్ కామెంట్స్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×