E-Paper
Advertisement

Road Safety: ఇంట్లో మీ కోసం ఎదురుచూసే వారున్నారు.. ఘోర ప్రమాద వీడియోతో హెచ్చరించిన సజ్జనార్

Road Safety: ఇంట్లో మీ కోసం ఎదురుచూసే వారున్నారు.. ఘోర ప్రమాద వీడియోతో హెచ్చరించిన సజ్జనార్
Advertisement

Road Safety: సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా రోడ్డు భద్రతపై వాహనదారులను మరోసారి హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ వద్ద నేషనల్ హైవే-43పై ఇటీవల జరిగిన ఒక ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తత ఎంత అవసరమో వివరించారు. “రెప్పపాటు ఆదమరుపు… రెప్పవాల్చని విషాదం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రోడ్డు ప్రమాదాల తీవ్రతను కళ్లకు కట్టాయి. అతివేగం లేదా చిన్న అజాగ్రత్త ప్రాణాలనే కాకుండా, ఎదుటివారి కుటుంబాల్లోనూ తీరని శోకాన్ని నింపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు ప్రతి క్షణం ఏకాగ్రతతో ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం కేవలం చట్టం కోసం కాదని, అది మన ప్రాణ రక్షణ కోసమని సజ్జనార్ పేర్కొన్నారు. ముఖ్యంగా మితిమీరిన వేగం ప్రాణాంతకంగా మారుతుందని, ఇంటి వద్ద మన రాక కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారనే విషయాన్ని ప్రతి డ్రైవర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ భయంకరమైన ప్రమాద దృశ్యాలు చూసైనా వాహనదారులు తమ బాధ్యతను గుర్తించాలని ఆయన కోరారు.

Advertisement

సజ్జనార్ నిత్యం సామాజిక అంశాలపై స్పందిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు భద్రత పట్ల అవగాహన పెంచేందుకు ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాలను నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రయోగాలు చేయవద్దని, సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఆయన తన సందేశం ద్వారా పిలుపునిచ్చారు.

Advertisement

Read Also: YSRCP-TDP War: అంబటి అరెస్ట్.. రంగంలోకి ‘కులం’

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×