E-Paper
Advertisement

Valentines Day Scams: ప్రేమ వేచి ఉండగలదు.. స్కామర్లు లేరు.. రొమాన్స్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండమంటున్న సజ్జనార్

Valentines Day Scams: ప్రేమ వేచి ఉండగలదు.. స్కామర్లు లేరు.. రొమాన్స్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండమంటున్న సజ్జనార్
Advertisement

Valentines Day Scams: వాలెంటైన్స్ డే వస్తోందంటే ప్రేమికుల్లో ఉత్సాహం ఉండటం సహజం, కానీ ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు కూడా తమ వల విసిరేందుకు సిద్ధంగా ఉంటారని సిటీ కమిషనర్ వి.సి. సజ్జనార్ హెచ్చరించారు. డేటింగ్ యాప్స్ మరియు సోషల్ మీడియా వేదికలుగా ‘ప్రేమ’ కోసం వెతుకుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ చీటర్స్ సరికొత్త రొమాన్స్ స్కామ్‌లకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమయ్యే వ్యక్తులు మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఖాళీ చేసే ప్రమాదం ఉందని, కేవలం గులాబీల గురించే కాకుండా స్కామర్ల ‘రెడ్ ఫ్లాగ్స్’ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ స్కామర్లు సాధారణంగా విదేశాల్లో స్థిరపడ్డామని లేదా పెద్ద ఉద్యోగం చేస్తున్నామని నమ్మబలుకుతూ బాధితులకు దగ్గరవుతారు. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” వంటి తీపి మాటలతో బాధితుల నమ్మకాన్ని గెలుచుకుని, ఆ తర్వాత ఆర్థిక అవసరాల పేరుతో మోసాలకు తెరలేపుతారు. మెడికల్ ఎమర్జెన్సీ అని, వీసా సమస్యలని లేదా అత్యవసరంగా డబ్బు అవసరమని చెప్పి సాయం అడుగుతారు. ఒక అడుగు ముందుకేసి, మీ కోసం విదేశాల నుండి కస్టమ్స్ వద్ద చిక్కుకున్న “విలువైన బహుమతి” పంపామని, దానిని విడిపించడానికి ట్యాక్స్ కట్టాలని చెప్పి లక్షలాది రూపాయలు కాజేస్తుంటారు.

Advertisement

పరిచయం లేని వ్యక్తులకు లేదా ఆన్‌లైన్ మిత్రులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారాన్ని, క్రెడిట్ కార్డ్ వివరాలను పంపించవద్దని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా క్రిప్టోకరెన్సీ, గిఫ్ట్ కార్డ్‌ల రూపంలో డబ్బు పంపమని ఎవరైనా కోరితే అది ఖచ్చితంగా మోసమని గ్రహించాలని స్పష్టం చేశారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే మీ కుటుంబ సభ్యుల లేదా స్నేహితుల సహాయం తీసుకోవాలని, గుడ్డిగా ఆన్‌లైన్ వ్యక్తులను నమ్మవద్దని సూచించారు.

ప్రేమ కోసం వేచి ఉండవచ్చు కానీ, స్కామర్లు మీ డబ్బును దోచుకోవడానికి వేచి ఉండలేరని ఆయన తన సందేశంలో చురకలు అంటించారు. ఆన్‌లైన్ ప్రపంచంలో ప్రేమ పేరుతో జరిగే ఈ రకమైన సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసుల తరపున ఆయన హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ నేరాలు నిరంతరం పెరుగుతున్న తరుణంలో, స్వీయ అప్రమత్తత ఒక్కటే మనల్ని ఈ రొమాన్స్ స్కామ్‌ల నుండి రక్షించగలదు.

Advertisement

Read Also: HYDRAA: ఆక్రమణలపై హైడ్రా పంజా.. రూ. 2200 కోట్ల విలువైన భూమి స్వాధీనం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×