E-Paper
Advertisement

Scooty Driving Risks: స్కూటీ డ్రైవర్లు తస్మాత్ జాగ్రత్త.. పిల్లల భద్రతపై ఐపీఎస్ అధికారి స‌జ్జ‌నార్ పోస్ట్

Scooty Driving Risks: స్కూటీ డ్రైవర్లు తస్మాత్ జాగ్రత్త.. పిల్లల భద్రతపై ఐపీఎస్ అధికారి స‌జ్జ‌నార్ పోస్ట్
Advertisement

Scooty Driving Risks: స్కూటీలపై పిల్లలతో ప్రయాణిస్తున్నారా? చిన్న అజాగ్రత్త.. పెద్ద అనర్థానికి కార‌ణం అవుతుంద‌న‌డానికి నిద‌ర్శ‌న‌మే ఈ వీడియో అంటూ హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ ఎక్స్ వేదిక‌గా షేర్ చేశారు. రోడ్డు భద్రతపై నిరంతరం అవగాహన కల్పించే సజ్జనార్ తాజాగా తల్లిదండ్రులకు ఒక కీలక హెచ్చరిక జారీ చేశారు. స్కూటీల ముందు భాగంలో పిల్లలను నిల్చోబెట్టుకుని ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో వివరిస్తూ ఆయన ఒక సందేశాన్ని పంచుకున్నారు. వాహనం ఆపినప్పుడు లేదా పిల్లలు దిగే క్రమంలో అజాగ్రత్తగా ఉంటే అది ప్రాణాలకే ముప్పు తెస్తుందని ఆయన హెచ్చరించారు.

ముఖ్యంగా వాహనం నిలిపి ఉంచినప్పుడు పిల్లలు పొరపాటున యాక్సిలరేటర్ తిప్పితే వాహనం అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతాయని సజ్జనార్ పేర్కొన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఒక ఘోర ఘటనే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. చిన్నపాటి నిర్లక్ష్యం కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతుందని, వాహనదారులు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Advertisement

వాహనం ఆపగానే ఇంజిన్ కిల్ స్విచ్ వాడటం లేదా ఇగ్నిషన్ ఆఫ్ చేసి తాళం (Key) తీసేయడం అలవాటు చేసుకోవాలి. పిల్లలు బండి దిగేటప్పుడు లేదా ఎక్కేటప్పుడు బ్రేక్‌ను గట్టిగా పట్టుకుని ఉండాలి. పిల్లలు ముందు భాగంలో ఉన్నప్పుడు వారి చేతులు యాక్సిలరేటర్ వైపు వెళ్లకుండా గమనిస్తూ ఉండాలి.

మీ భద్రత మీ చేతుల్లోనే ఉందని, ఈ విషయాన్ని ఇతరులకు కూడా తెలియజేసి ప్రాణనష్టాన్ని నివారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం కేవలం జరిమానాల కోసం కాదని, ప్రాణాలను కాపాడుకోవడానికేనని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×