E-Paper
Advertisement

Uttam Kumar Reddy: చేయి గుర్తుకే ఓటు వేయండి.. తిర్మలగిరి అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: చేయి గుర్తుకే ఓటు వేయండి.. తిర్మలగిరి అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Advertisement

Uttam Kumar Reddy: తెలంగాణ‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేడే చివరి రోజు కావడంతో, ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీ ఎత్తున రోడ్ షోలు, ర్యాలీలు నిర్వ‌హించాయి. సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ తరపున సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, ఈ రోడ్ షో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ప్రచారంలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తిర్మలగిరి మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. 15 వార్డులలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమని, స్థానిక అభివృద్ధి వేగవంతం కావాలంటే కాంగ్రెస్ విజయం అవసరమని ఆయన స్పష్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల అభ్యర్థులను గెలిపించి తనకు అపురూపమైన విజయ కానుకను అందించాలని ఆయన నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

ఈ రోడ్ షోకు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, సామాన్య ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడంతో తిర్మలగిరి వీధులన్నీ జనసంద్రంగా మారాయి. అడుగడుగునా కాంగ్రెస్ జెండాలు, నినాదాలతో ప్రచార పర్వం హోరెత్తింది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలు ‘చేయి’ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కోరారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటర్లను అభ్యర్థించారు.

Read Also: Congress Complaint: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ శ్రేణులు సీరియస్.. కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×