E-Paper
Advertisement

Collectorate Bomb Threat: 3:30 గంటలకు కలెక్టరేట్ పేల్చేస్తాం.. గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపు, ఎక్కడంటే?

Collectorate Bomb Threat: 3:30 గంటలకు కలెక్టరేట్ పేల్చేస్తాం.. గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపు, ఎక్కడంటే?
Advertisement

Collectorate Bomb Threat: తెలుగు రాష్ట్రాల్లో వరుస బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల తిరుపతిలో ఉన్న పలు హోటల్లు, రెస్టారెంట్లతో పాటు కలెక్టరేట్‌కు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌లతో తనిఖీలు చేయించారు. బాంబ్ ఏమీ కనిపించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు.

ఈ ఘటన మరువక ముందే తెలంగాణలో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేగింది. 3:30 గంటలకు కలెక్టరేట్ పేల్చేస్తాం.. అంటూ గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌ సిబ్బందికి ఈ మెయిల్ వచ్చినట్లు సమాచారం. ముప్పల లక్ష్మీనారాయణ అనే మెయిల్ ఐడీతో మెసేజ్ వచ్చింది. బెదిరింపు మెయిల్‌లో అల్లా అక్బర్ అని కూడా ఉందని కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ తెలిపారు. దీంతో అప్రమత్తమైన కలెక్టరేట్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

కలెక్టరేట్‌‌కు చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో కలెక్టర్ ఆఫీస్ మొత్తం తనిఖీ చేయించారు. దీంతో పాటు క్వార్టర్స్‌లో కూడా సెర్చ్ ఆపరేషన్ జరిపారు. బాంబ్ కానీ ప్రమాదకరమైన వస్తువులు కానీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం ఏమీ లేదని నిర్దారించుకున్న తరువాత కలెక్టరేట్‌‌ నుంచి వెళ్లిపోయారు.

అయితే ఎవరో కావాలనే ఫేక్ మెయిల్ పంపించి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి సైబర్ క్రైమ్ పోలీసులకు ఐడీ వివరాలు ఇచ్చినట్లు వెల్లడించారు. నిందితులు దొరికితే బెదిరింపులు పాల్పడినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×