E-Paper
Advertisement

Karimnagar District: యమలోకానికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిన వీణవంక రహదారులు.. ఇది రోడ్డు భద్రతా? లేక ప్రజల ప్రాణాలతో చెలగాటమా?

Karimnagar District: యమలోకానికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిన వీణవంక రహదారులు.. ఇది రోడ్డు భద్రతా? లేక ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
Advertisement

Karimnagar District: కరీంనగర్ జిల్లా (Karimnagar District) వీణవంక మండలం ప్రజల జీవనం నిత్యం ప్రాణాల గండంలో సాగుతోంది. కారణం నియంత్రణలేని ఇసుక లారీలు. రోడ్లన్నీ లారీలతో నిండిపోయి, సాధారణ వాహనాలు ప్రయాణించాలంటే భయం తప్పడం లేదు. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్ పక్కన ఉన్న ఇళ్లు పూర్తిగా దుమ్ము, దూళితో కప్పివేయబడ్డాయి. తలుపులు మూసుకున్నా దుమ్ము లోపలికి వస్తోందని, పిల్లలు, వృద్ధులు శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: T20 World Cup 2026: టీ20 ప్ర‌పంచ క‌ప్ షెడ్యూల్ ఇదే, ఆసీస్ కు ఎదురుదెబ్బ‌..టీమిండియా మ్యాచ్ లు ఎక్కడ ఉచితంగా చూడాలంటే

ఇసుక లారీ డ్రైవర్లు ఇష్టానుసారం

Advertisement

అత్యవసర వాహనాలు, అంబులెన్సులు, ఫైర్ వాహనాలు వెళ్లాలన్నా కనీసం రోడ్డు ఖాళీ లేకుండా ఇసుక లారీ డ్రైవర్లు ఇష్టానుసారంగా వాహనాలు నిలుపుతున్నారు. పార్కింగ్ సూచికలు లేకుండా, రోడ్డు మీదే లారీలు నిలిపివేయడం వల్ల ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయి. అయినా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక లారీలు రోడ్డు మీద కనిపించకుండా నిలిచిపోవడం వల్ల రాత్రి వేళల్లో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోంది.

పర్యవేక్షణ ఎవరి బాధ్యత?

ఇది రోడ్డు భద్రతా? లేక ప్రజల ప్రాణాలతో చెలగాటమా?” అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నలు ఇవే ఇసుక లారీలపై పర్యవేక్షణ ఎవరి బాధ్యత? రోడ్డును గోదాములా మార్చిన లారీ యజమానులపై చర్యలు ఎప్పుడు? ప్రమాదం జరిగాకే అధికారులు స్పందిస్తారా? వీణవంక మండలం యమలోకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారకుండా ఉండాలంటే తక్షణ చర్యలు, తీసుకోవాలి. లారీ నియంత్రణ, రోడ్ భద్రత అమలు తప్పనిసరి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Jangaon Municipality: బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో మున్సిపల్ నిధులు దుర్వినియోగం.. ఆర్టిఐ సమాచారంతో వెలుగులోకి సంచలన నిజాలు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×