E-Paper
Advertisement

Telangana : గ్రేహౌండ్స్ పోలీసులను కోబ్రానే చంపేసిందా? కర్రెగుట్టల్లో ట్విస్ట్?

Telangana : గ్రేహౌండ్స్ పోలీసులను కోబ్రానే చంపేసిందా? కర్రెగుట్టల్లో ట్విస్ట్?
Advertisement

Telangana : కర్రెగుట్టల్లో నాన్‌స్టాప్ కూంబింగ్. మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ. కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్నతో పాటు 22 మంది హతం. బలగాలకూ ప్రాణనష్టం తప్పలేదు. ముగ్గురు గ్రేహౌండ్స్ కమాండోలు మృతి చెందారు. తెలంగాణ డీజీపీ, అడిషనల్ డీజీలు వరంగల్ వెళ్లి మరీ మృతులకు నివాళులు అర్పించారు. ఇంతవరకూ న్యూస్. కాకపోతే, ఆఫ్ ది రికార్డ్ ఇదే వార్త మరో రకంగా తెలుస్తోంది.

గ్రేహౌండ్స్, కోబ్రా షూటౌట్?

Advertisement

కర్రెగుట్టలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్టు సమాచారం. కమ్యూనికేషన్ లోపంతో రాష్ట్ర గ్రేహౌండ్స్ బలగాలపై దాడి జరిగిందనే అనుమానం వ్యక్తం అవుతోంది. మావోయిస్టు దళంగా భావించి..  గ్రేహౌండ్స్ టీమ్, CRPF కోబ్రా జవాన్లు పరస్పరం కాల్పులు జరుపుకున్నట్టు తెలుస్తోంది. కోబ్రా కాల్పుల్లో.. ముగ్గురు గ్రేహౌండ్స్ కమెండోలు చనిపోయారని.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయని అంటున్నారు. ఈ విషయం బయటకు రాకుండా.. మావోయిస్టులే కాల్పులు జరిపినట్టుగా ఇష్యూను పోలీస్ శాఖ డైవర్ట్ చేస్తున్నట్టు చెబుతున్నారు.

ఆ ముగ్గురు అలా చనిపోయారా?

Advertisement

కర్రెగుట్టల్లో భారీగా మోహరించిన బలగాలు మధ్య సమన్వయ లోపంతో అయోమయం ఏర్పడినట్టు సమాచారం. ఒకే టైంలో.. ఒకే ప్లేస్‌లో CRPF కోబ్రా జవాన్లు, గ్రేహౌండ్స్ పోలీసులు ఎదురుపడ్డారని తెలుస్తోంది. ఆ కాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్స్ సిబ్బంది చనిపోయినట్టు చెబుతున్నారు. అయితే ఇదంతా అనధికారిక సమాచారం మాత్రమే. నిజమా? కాదా? అనేది ఎవరూ ధృవీకరించట్లేదు.

కగార్‌పై సిందూర్ ఎఫెక్ట్..

మరోవైపు.. ఆపరేషన్ కగార్‌పై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ పడింది. తెలంగాణ సరిహద్దులోని CRPF బలగాలను కేంద్రం వెనక్కి రప్పిస్తోంది. CRPF కోబ్రా జవాన్లను తమ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. పామూరు, ఆలూబాక, పెద్దగుట్ట పరిసరాల్లో మోహరించిన బలగాలను వెనక్కి రప్పిస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపధ్యంలో కర్రెగుట్టల నుంచి సుమారు 9వేల మందికి పైగా బలగాలను కేంద్రం వెనక్కి రప్పిస్తోంది. ఆదివారం ఉదయంలోగా ఇండో – పాక్ బోర్డర్‌కు బలగాలు తరలి వెళ్లనున్నాయి. అయితే, ఆపరేషన్ కగార్ మాత్రం ఎప్పటిలానే కంటిన్యూ అవుతుంది. CRPF 217, 81, 86 బెటాలియన్లు, DRG, STF, బస్తర్ ఫైటర్స్ ఆధ్వర్యంలో కగార్ ఆపరేషన్ యథావిధిగా కొనసాగనుంది.

Also Read : నెక్ట్స్ లెవెల్‌కి చేరిన ఇండియా పాక్ యుద్ధం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×