E-Paper
Advertisement

TSRTC Revenue | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పెరిగిన ఆర్టీసీ ఆదాయం.. ఎలాగో తెలుసా?

TSRTC Revenue | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా తెలంగాణ ఆర్టీసీ ఆదాయం భారీగా పెరిగింది. రాష్ట్రమంతటా మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం చేయడంతో ఆర్టీసీకి నష్టాలు వస్తాయని అందరూ భావించారు. కానీ దీనికి వ్యతిరేకంగా ఆర్టీసీ సంస్థకు లాభాలు వస్తున్నాయి.

పథకం ప్రారంభమైన వారం రోజుల వరకు మహిళలందరూ ఎటువంగి గుర్తింపు కార్డులు చూపించకుండా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల ఓ కీలక ప్రకటన చేశారు. మహిళలు తెలంగాణ అడ్రస్ ఉన్న ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఐడీ కార్డ్ చూపిస్తే బస్సు కండక్టర్ నుంచి జీరో టికెట్ పొందవచ్చు. తెలంగాణ వాసిగా గుర్తింపు కార్డు లేకపోతే డబ్బులు చెల్లించి టికెట్ తీసుకోవాల్సిందే. లేకపోతే రూ.500 జరిమానా విధిస్తారు.

Advertisement

తెలంగాణ రాష్ట్రమంతా నిత్యం 13 లక్షల ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇందులో ఉచిత పథకం కింద 80 శాతం వరకు మహిళలే ప్రయాణిస్తున్నారని సమాచారం. దీనివల్ల ఆర్టీసికి నష్టాలు వస్తాయని అందరూ భావించినా.. ఆ నష్టాన్ని ప్రభుత్వం రీఅంబర్స్ చేస్తుంది. ఆర్టీసీ యాజమాన్యం జీరో టికెట్ లెక్కలు.. ప్రభుత్వానికి పంపితే ఆ మొత్తాన్ని రీయంబర్స్ మెంట్ ద్వారా తిరిగి వస్తుంది. ఉచిత టికెట్ పథకం మొదలైనప్పటి నుంచి బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నవంబర్ నెల వరకు గణాంకాలు పరిశీలిస్తే.. ఆర్టీసీకి రోజుకు రూ. 13 లక్షల నుంచి రూ.14 లక్షల ఆదాయం రాగా.. పథకం ద్వారా 18-25 లక్షలకు పెరిగిందని అంచనా.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×