E-Paper
Advertisement

TS Weather: పెరిగిన చలిగాలులు.. తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

TS Weather: పెరిగిన చలిగాలులు.. తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Advertisement

TS Weather: తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. ఉత్తరాది జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉదయం 10 గంటలైనా.. చలితీవ్రత తగ్గడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ వాసులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. ఉత్తర భారతం నుంచి తెలంగాణ మీదుగా వీస్తోన్న గాలుల కారణంగా చలిగాలులు పెరిగాయని అధికారులు వెల్లడించారు. పగటిపూట ఎండ ఉన్నా.. రాత్రిపూట చలిఎక్కువగానే ఉంటుందని, రానున్న రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందని తెలిపారు.

మంగళవారం ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు స్వల్పంగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో మంగళ, బుధవారాలు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే కొన్ని జిల్లాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Advertisement

రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రం భీమ్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఉదయం వేళలో పొగమంచు అధికంగా ఉండొచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోనూ స్వల్పంగా పొగమంచు ఉంటుందని పేర్కొన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×