E-Paper
Advertisement

Sangareddy: రూ.2.87 కోట్ల విలువైన గంజాయి పట్టివేత, పక్కా స్కెచ్‌తో పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?

Sangareddy: రూ.2.87 కోట్ల విలువైన గంజాయి పట్టివేత, పక్కా స్కెచ్‌తో పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?
Advertisement

సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీ ఎత్తున గంజాయి రవాణాను అడ్డుకున్నారు. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో సీసీఎస్, ఎస్ న్యాబ్, సదాశివపేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సదాశివపేట నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఒక కియా కారును మార్గమధ్యంలో ఆపారు. ఆ కారును తనిఖీ చేయగా గంజాయి ముఠా గుట్టు రట్టయింది. కియా కారు వెనుక వస్తున్న ఒక డీసీఎం వాహనంలో భారీగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు.

పోలీసులు ఆ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డీసీఎం లోపల ప్యాకెట్ల రూపంలో భద్రపరిచిన ఎండు గంజాయి లభ్యమైంది. మొత్తం 286 ప్యాకెట్లలో ప్యాక్ చేసిన 574 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ. 2.87 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన కియా కారు, డీసీఎం వాహనాన్ని ఘటనా స్థలంలోనే సీజ్ చేశారు.

Advertisement

ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులంతా మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కియా కారును పైలట్ వాహనంగా వాడుతూ పోలీసుల కళ్లుగప్పి గంజాయి తరలించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ సరుకు ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల కదలికలపై నిఘా పెంచినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ALSO READ: Telangana Cabinet: జీహెచ్‌ఎంసీ స్థానంలో సరికొత్త అర్బన్ చట్టం.. రేవంత్ సర్కార్ కీలక అడుగు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×