E-Paper
Advertisement

TS RTC : రికార్డ్ కలెక్షన్స్.. ఒక్క రోజే 52.78 లక్షల మంది ప్రయాణం..

TS RTC : సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో శనివారం ఒక్కరోజే 1,861 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు సంస్థ నడిపించిందని వెల్లడించారు. హైదరాబాద్‌లో 1,127 సిటీ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం,విజయవాడ, తదితర రూట్లలో తిప్పడం జరిగిందన్నారు.

సంక్రాంతి సందర్బంగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు సంస్థ ప్రణాళికలు సిద్దం చేసిందని సజ్జనార్ తెలిపారు. ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లోనే 4,400 ప్రత్యేక బస్సులను నడిపించినట్లు వెల్లడించారు. శనివారం వరకు మొత్తంగా 6261 ప్రత్యేక బస్సులను నడపడం జరిగిందన్నారు. ఆదివారం కూడా 652 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా.. మధ్యాహ్నం వరకు 450 బస్సులను సంస్థ తిప్పిందని పేర్కొన్నారు.

Advertisement

శనివారం ఒక్క రోజులోనే 52.78 లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు సిబ్బంది చేర్చారని సజ్జనార్ తెలిపారు. అందులో సగానికి పైగా మహిళా ప్రయాణికులే ఉన్నారన్నారు. మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని ఉచితంగా వారంతా సొంతూళ్లకు వెళ్లారన్నారు. ముందస్తు ప్రణాళిక తో పాటు సిబ్బంది సమన్వయంతో పని చేయడం వల్ల సంక్రాంతికి ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ప్రయాణికులను సొంతూళ్లకు సంస్థ చేర్చిందని సజ్జనార్ అన్నారు.

తొలి సారిగా బస్‌ భవన్‌ లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేశామని సజ్జనార్ తెలిపారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులు అందుబాటులో ఉంచామని తెలిపారు. సంక్రాంతికి ప్రశాంతంగా ప్రజలను సొంతూళ్లకు చేర్చడంలో పాలుపంచుకున్న టీఎస్‌ ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×