E-Paper
Advertisement

TS High Court : ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్‌.. హైకోర్టు ఉత్తర్వులు జారీ..

TS High Court : ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్‌.. హైకోర్టు ఉత్తర్వులు.. : తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా నియమితులైన విషయం తెలిసిందే.

TS High Court : ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్‌.. హైకోర్టు ఉత్తర్వులు జారీ..
Advertisement

TS High Court : తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా నియమితులైన విషయం తెలిసిందే.

ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ల గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకాన్ని సవాల్‌ చేస్తూ సత్యనారాయణ దాసోజు శ్రవణ్‌, హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పటిషన్‌ విచారణ తేలెంత వరకు పిటిషన్‌ విచారణ ఆపాలంటూ హై కోర్టును కోరారు. కోర్టు వాళ్ల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ప్రమాణం చేయించవద్దని చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 8వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది.

Advertisement

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని రోజుల క్రితం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ప్రకటించింది. గవర్నర్ కోటాలో సత్యనారాయణ , దాసోజు శ్రవణ్ నామినేట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ కు పంపారు. అయితే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ వీరి పేర్లను ఆమోదించలేదు. ఇంతలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.

గవర్నర్ తమ పేరును ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాష్ట్ర హైకోర్టుకు ఆశ్రయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందనన్నారు. దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ లేదని వారు పేర్కొన్నారు. వీరి పిటిషిన్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. అది తేలకముందే కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌లను కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటాకు ప్రతిపాదించింది. అందుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతోనే రాజకీయ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

Advertisement

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×