E-Paper
Advertisement

TRS: విషం చిమ్మిన మోదీ.. మునుగోడు ఓటమే కారణం :టీఆర్ఎస్

TRS: విషం చిమ్మిన మోదీ.. మునుగోడు ఓటమే కారణం :టీఆర్ఎస్
Advertisement

TRS: హైదరాబాద్ గడ్డ మీదనుంచి పీఎం మోదీ.. కేసీఆర్ సర్కారుకు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం తెలంగాణలో రాజకీయ వేడిని మరింత రాజేశాయి. ప్రజలను దోచుకునే వాళ్లను వదిలిపెట్టబోమని, అవినీతిపరులతో చేతులు కలిపారని.. మునుగోడులో నైతిక విజయం బీజేపీదే అన్నట్టు మోదీ మాట్లాడారు.

ఇక, మోదీ ప్రసంగంపై టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. మునుగోడు ఓటమి అక్కసుతోనే కేసీఆర్‌పై మోదీ విషం చిమ్మారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు హంసలాంటి వారని.. నీళ్లు, పాలను వేరు చేసినట్టు విషాన్ని కూడా వేరు చేస్తారన్నారు. గుజరాత్‌ ప్రజల్లా తెలంగాణ జనాలు మోసపోరని తెలిపారు. నేతలు, పార్టీలను భయపెట్టి ఎదురులేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

సీఎం కేసీఆర్‌పై విషం చిమ్మడం మినహా ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిందేమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్థలను అడ్డగోలుగా ఉపయోగించి మునుగోడుపై దాడి చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా.. మునుగోడులో ఓడిపోయామన్న అక్కసు తప్ప మోదీ మాటల్లో కొత్తగా ఏమీ కనిపించలేదన్నారు.

మోదీ ఎప్పుడు వచ్చినా తెలంగాణకు ఒక్క రూపాయి ఇచ్చిన సందర్భం ఎప్పుడైనా ఉందా? అని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. వడ్డీతో చెల్లిస్తామన్న మోదీ.. ముందు ఇవ్వాల్సిన పైసలు ఇస్తే చాలని.. వడ్డీతో సహా మీరు ఇస్తానన్నది భారత దేశ ప్రజలే మీకు ఇస్తారంటూ జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×