E-Paper
Advertisement

కవిత పార్టీ వెనుక సీఎం చంద్రబాబు.. అందుకే జెండాలో పసుపు కలర్, టీఆర్ఎస్ చీఫ్ ఏమన్నారు?

కవిత పార్టీ వెనుక సీఎం చంద్రబాబు.. అందుకే జెండాలో పసుపు కలర్, టీఆర్ఎస్ చీఫ్ ఏమన్నారు?
Advertisement

TRS Chief Kavitha: కవిత పార్టీ పెట్టి రెండు నెలలు గడిచిపోయింది. అయినా ఆ పార్టీ గురించి రకరకాలుగా ప్రచారాలు సాగుతున్నాయి? టీఆర్ఎస్ పార్టీ వెనుక తొలుత సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ టాక్ నడిచింది. ఇప్పుడేమో ఏపీ సీఎం చంద్రబాబు పేరు వెలుగులోకి వచ్చింది? దీనిపై ఆ పార్టీ చీఫ్ కవిత ఏమన్నారు?

టీఆర్ఎస్ పార్టీలో ఎల్లో కలర్‌పై కవిత క్లారిటీ

Advertisement

బిగ్ టీవీ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. పసుపు కలర్ భూమి పుట్టినప్పటినుంచి ఉందని, అది ఓన్లీ తెలుగుదేశం పార్టీకి చెందుతుందంటే అన్యాయమన్నారు. పసుపు అంటే నిజామాబాద్ వాళ్లకు చాలా సెంటిమెంట్ అని తెలిపారు. ఆ జిల్లాలో ఎక్కువగా పండేది పసుపు పంట అని చెప్పారు.

అందులోనూ ఆడబిడ్డకు పసుపు అంటే బాగా సెంటిమెంట్ అని గుర్తు చేశారు. రెండు బీసీ ఉద్యమాలలో ఎప్పటి నుంచైతే తాను మమేకం అయ్యానో, ఎల్లమ్మ, పెద్దమ్మ, మల్లన్న, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, శివమాల, ఇలా ఏ మాల వేసినా పసుపు ఉంటుందన్నారు. తనకు బాగా నచ్చిన కలర్ అని తెలిపారు.

Advertisement

తనను ఎవరూ నడిపించలేదు.. తాను ఇండిపెండెంట్- కవిత

పసుపు రంగు అంటేనే సమృద్ధి, సంపద, వెలుతురు, లైట్, సూర్యరశ్మి అని వివరించారు. అలా ఆలోచించి తెలంగాణ సమృద్ధిగా ఉండాలని భావించి లిమిట్ లెస్ కలర్ ఎల్లో అని అందుకోసం పెట్టుకున్నామని తెలియజేశారు. బ్లూ కలర్ అనేది శ్రమించే లక్ష్యణమని, ఆడబిడ్డలు, కార్మికులు, ఎస్టీ, ఎస్సీలు కావచ్చన్నారు.

ఆదివాసీల రంగు ఎల్లోనే కలరేనని గుర్తు చేశారు. బ్లూ అనేది శ్రామిక వర్గానికి సంబంధించి, సామాజిక తెలంగాణకు సంబంధించిన కలరని వివరించారు. గ్రీన్ కలర్ అనేది జాగృతి నుండి మాకు గ్రీన్ అండ్ వైట్ ఫ్లాగ్ ఉండేదన్నారు. గ్రీన్ అనేది రైతులు, పర్యావరణం, మైనారిటీ కమ్యూనిటీస్‌ని రిప్రెసెంట్ చేయడానికని వివరించారు.

ALSO READ: చిరంజీవిని చూశాం.. విజయ్‌ని గమనించాం.. తెలంగాణలో అధికారంలోకి వస్తాం-కవిత కీలక వ్యాఖ్యలు

పార్టీలో హిందూ, ముస్లిం అందరిని రిప్రెసెంట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మా పార్టీ, జెండాకు సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబుతో ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు ఆమె. పైగా తాము సీఎం చంద్రబాబును విమర్శించినంత అంటూనే.. ప్రొఫెసర్ నాగేశ్వర్‌ని అరెస్ట్ చేస్తే ఇల్లు ముట్టడి ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాలు వేరు, కుటుంబం వేరన్నారు. మా ఫాదర్ కేసీఆర్ విషయంలో పొలిటికల్ విమర్శలేనని, పర్సనల్ గా రెస్పెక్ట్ ఉంటుందన్నారు. నన్నైతే ఎవరు నడిపించలేదని, తాను ఇండిపెండెంట్ అని గుర్తు చేశారు.

 

కవిత పార్టీ వెనుక సీఎం చంద్రబాబు.. అందుకే జెండాలో పసుపు కలర్, టీఆర్ఎస్ ఛీఫ్ ఏమన్నారు?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×