E-Paper
Advertisement

Tree Fell on Couple : ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి.. భారీ వృక్షం పడి భర్త మృతి

Tree Fell on Couple : ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి.. భారీ వృక్షం పడి భర్త మృతి
Advertisement

Tree Fell on Couple in Bollaram Hospital : ఒక్కసారి విధి రాత రాస్తే.. దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని అంటుంటారు. అప్పుడప్పుడు మన కళ్ల ముందు జరిగే ఘటనలే ఇందుకు నిదర్శనం. మరణం ఎవ్వరికీ డేట్, టైమ్ చెప్పి రాదు. మన అనుకున్నవాళ్లు ఎన్నాళ్లుంటారో ఎవరికీ తెలియదు. ప్రతి క్షణం మనిషి మృత్యువుతో జీవన పోరాటం చేస్తున్నాడు. అప్పటి వరకూ మనతో ఉన్నవారు మరు నిమిషానికి ఊహించని రీతిలో చనిపోతారని ఎవరైనా అనుకుంటారా ? కలలోనైనా అలాంటి ఘటనలను ఊహించగలరా ? హైదరాబాద్ లోని బొల్లారం కంటోన్మెంట్ ఆస్పత్రిలో ఇదే జరిగింది.

చికిత్స నిమిత్తం దంపతులు ఆస్పత్రికి వచ్చారు. అదే సమయంలో అక్కడున్న భారీ వృక్షం వారిపై విరిగి పడటంతో.. భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సరళాదేవికి తీవ్రగాయాలయ్యాయి. రోగానికి చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే చెట్టు రూపంలో మృత్యువు కబళించింది. తీవ్రంగా గాయపడిన సరళాదేవిని అక్కడే చికిత్స చేసి.. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. రవీందర్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

Advertisement

బొల్లారం ఆస్పత్రి ఆవరణలో జరిగిన ఈ ఘటనతో.. అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. సరళ దంపతుల కంటే ముందు ఒక బైక్ ఆ చెట్టు కింది నుంచే వెళ్లింది. తర్వాత వీరు ఆ మార్గంలోనే వెళ్లారు. వీరిపై విధి వక్రీకరించి.. భారీ వృక్షం కూలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×