E-Paper
Advertisement

Transport Department: వాహనాలు లేక రవాణాశాఖ ఉద్యోగుల ఇక్కట్లు.. ఆశతో ఎదురుచూస్తున్న అధికారులు

Transport Department: వాహనాలు లేక రవాణాశాఖ ఉద్యోగుల ఇక్కట్లు.. ఆశతో ఎదురుచూస్తున్న అధికారులు
Advertisement

Transport Department: రవాణాశాఖ ఉద్యోగులకు ప్రభుత్వం వాహనాలు ఇస్తామని ప్రకటించింది. నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తనిఖీలు చేసేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే సందర్భంలోనూ ఇక్కట్లు తప్పడం లేదు. కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ ముందుకు సాగకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఈ బడ్జెట్ లోనైనా నిధులు కేటాయించి వాహనాలు ఇస్తారని ఉద్యోగులు ఆశిస్తున్నారు.

కేబినెట్ సైతం నిర్ణయం

ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేశాఖల్లో రవాణాశాఖ ఒకటి. అయితే ఈ శాఖలో సుమారు 350 వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 90 మంది ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులకు మాత్రమే ప్రభుత్వం వాహనాలు ఇచ్చినట్లు సమాచారం. స్టాప్ సిబ్బంది కాకుండా ఎంవీఐ, ఏఎంవీఐలు సుమారు 150మంది ఉంటారని సమాచారం. వీరికి ప్రభుత్వం వాహనాలు ఇవ్వాల్సి ఉంది. వీరితో పాటు కొంతమంది ఆర్టీఓలకు సైతం వాహనాలు లేవని సమాచారం. ఉన్నతాధికారులు సైతం ప్రభుత్వానికి వాహనాలు ఇవ్వాలని ప్రపోజల్ పంపించారు. ఈ అంశంపై కేబినెట్ సైతం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకొని కూడా ఏడాది గడుస్తుంది. కానీ వాహనాలను కొనుగోలు చేయలేదు.. రవాణాశాఖ అధికారులకు ఇవ్వలేదు. దీంతో ఎన్ పోర్స్ మెంట్ టీంలతో పాటు సీనియర్ ఎంవీఐలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఏఎంవీఐలది మరీదారుణం

Advertisement

రవాణాశాఖలో ఏఎంవీఐల పరిస్థితి మరింత దారుణం. గతేడాది 113 మంది ఏఎంవీఐలుగా రిక్రూట్ మెంట్ అయ్యారు. శిక్షణ పూర్తి చేసుకొని అక్టోబర్ లో విధుల్లో చేరారు. అయితే వారికి వాహనాలు లేకపోవడంతో తనిఖీలకు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. వేతనం నుంచే చార్జీలు పెట్టుకొని వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వాహనాలు లేకపోవడంతో సమయానికి వెళ్లలేకపోతున్నామని తెలిపారు. సీనియర్ అధికారులతో కలిసి ఫీల్డ్ కు వెళ్లాలంటే వారికి ఇతర డ్యూటీలు పడటంతో వెళ్లలేకపోతున్నామని వెల్లడించారు.

Also Read: IND VS PAK: టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ..పాకిస్తాన్ ఫ్యాన్స్ క‌న్నీళ్లు, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ లో సంబ‌రాలు

ఎన్పోర్స్ మెంట్ టీంలు తీవ్ర ఇక్కట్లు

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం చెక్ పోస్టులను తొలగించింది. అక్కడ పనిచేసే ఎంవీఐ, ఏఎంవీఐలతో పాటు గతేడాది విధుల్లో చేరిన ఏఎంవీఐలు, చెక్ పోస్టుల సిబ్బందితో ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు ఏర్పాటు చేసింది. అయితే వారికి వాహనాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటివరకు వాహనాలు ఇవ్వలేదు. నిబంధనలు అతిక్రమించే వాహనాలపై, అధిక లోడు వాహనాలపై, అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేయాలంటే వాహనం తప్పనిసరి. కానీ వాహనాలు లేకపోవడంతో కొంతమంది సొంత వాహనాలతోనే విధులు నిర్వర్తిస్తున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలు అంటూ కాలయాపన?

ప్రభుత్వం రవాణాశాఖ అధికారులకు వాహనాలు ఇస్తామని గతేడాది కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. అయితే హయ్యార్ వాహనాలా? ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాలా? అనేదానిపై చర్చించారు. అయితే హైదరాబాద్ లో పోల్యూషన్ రహిత నగరంగా తీర్చేందుకు కృషిచేస్తామని, అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించింది. అయితే రవాణాశాఖ ఉద్యోగులకు సైతం ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం మళ్లీ కొత్తగా ఎస్టీమేషన్ వేస్తున్నట్లు తెలిసింది. అయితే ఎప్పటివరకు వాహనాలు కొనుగోలు చేసి అందజేస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అవి కొనుగోలు చేసేవరకు అయినా హయ్యార్ వాహనాలనైనా కేటాయిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.

Also Read: Taapsee Pannu: తనకు ఇంకా బతకాలనుందంటూ తాప్సీ వైరల్ కామెంట్.. ఏం జరిగిందంటే?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×