E-Paper
Advertisement

హైదరాబాద్‌లో విషాదం.. మియాపూర్‌ ఓపెన్ నాలాలో పడి వ్యక్తి గల్లంతు! గాలింపు ముమ్మరం

హైదరాబాద్‌లో విషాదం.. మియాపూర్‌ ఓపెన్ నాలాలో పడి వ్యక్తి గల్లంతు! గాలింపు ముమ్మరం
Advertisement

Hyderabad Manhole: వర్షాకాలం వస్తే చాలు సిటీ ప్రజలకు ఒకటే భయం. ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందోనన్న భయం వారిని అనుక్షణం వెంటాడుతోంది. తాజాగా మియాపూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. తెరిచి ఉన్న ఓపెన్ నాలాలో పడి ఓ వ్యక్తి గల్లంతు అయ్యాడు. మిస్సయిన వ్యక్తి కోసం హైడ్రా-ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. అసలు ఏం జరిగింది?

మియాపూర్‌లో మ్యాన్ హోల్ విషాదం- హైదరాబాద్ సిటీలో గడిచిన రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. మియాపూర్‌లో తెరిచి ఉన్న ఓపెన్ నాలాలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వ్యక్తిని హఫీజ్‌పేట్‌‌కు చెందిన బాలయ్యగా గుర్తించారు. ఈ ఘటన విషయం తెలియగానే హైడ్రా-ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. బాలయ్య కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.

Advertisement

నిర్లక్ష్యం ఎవరిది? వైశాలినగర్ అండర్‌పాస్ వద్ద నాలా మరమ్మతులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల నాలాలో పడి బాలయ్య గల్లంతయ్యాడన్నది ఆయన కుటుంబ సభ్యుల ఆరోపణ. పనులు జరుగుతున్న ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే ఈ ప్రమాదం తప్పదని అంటున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

అండర్ పాస్‌ కింద మరమ్మతులు-మరమ్మతులు చేసేందుకు కొన్నిరోజులుగా అండర్ పాస్‌ను అధికారులు మూసి వేశారు. ఈ వ్యవహారంలో మున్సిపల్ అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్‌హోల్ ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే గాంధీ అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి ఆయన పరిశీలించారు. ఘటన ఎలా జరిగిందనే దానిపై వివరాలను అధికారులు, సహాయక బృందాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

ALSO READ: కరీంనగర్​‌‌లో ట్రాఫిక్​ పోలీసుల నయా దందా..!

గాలింపు చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే గాంధీ. హైదరాబాద్‌లో రెండుగంటలపాటు వర్షాలు పడితే చాలా అందులోని నీరంతా బయటకు వస్తోంది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు ఒక్కోసారి మ్యాన్ హోల్‌లో పడి చనిపోయిన ఘటనలు లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నగరవాసులు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×