E-Paper
Advertisement

MEDCHAL: మేడ్చల్‌ జిల్లాలో విషాదం..ఆరుగురి ప్రాణం తీసిన ఈత సరదా

MEDCHAL: మేడ్చల్‌ జిల్లాలో విషాదం..ఆరుగురి ప్రాణం తీసిన ఈత సరదా
Advertisement

MEDCHAL: మేడ్చల్‌ జిల్లా జవహార్‌నగర్‌ పరిధిలో ఉన్న మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందారు. స్థానిక మదర్సా పాఠశాలలో చదివే విద్యార్థులను ఉపాధ్యాయుడు విహారయాత్రకు తీసుకెళ్లారు. విద్యార్థులు ఈత కొట్టేందుకు ఎర్రగుంట చెరువులో దిగారు. చెరువు లోతుగా ఉండటంతో విద్యార్థులు మునిగిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయుడు కూడా మునిపోయారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు.

మృతులు హైదరాబాద్ కాచిగూడలోని నెహ్రూనగర్‌ కు చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. మల్కారంలోని మదర్సాలో ప్రత్యేక శిక్షణా తరగతుల కోసం విద్యార్థులు వెళ్లారని తెలిపారు. ఈ దుర్ఘటనలో విద్యార్థులు ఇస్మాయిల్,జాఫర్‌, సోహైల్‌, అయాన్‌, రియాన్‌ తోపాటు ఉపాధ్యాయుడు యోహాన్‌ ప్రాణాలు కోల్పోయారు. ఆ విద్యార్థులంతా 12 నుంచి 14 ఏళ్ల వయసు మధ్య వారేనని పోలీసులు తెలిపారు. విద్యార్థుల మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×