// // Voter List Revision: ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. ఇబ్రహీంపట్నంలో ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు! -->
E-Paper
Advertisement

ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. ఇబ్రహీంపట్నంలో ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు!

ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. ఇబ్రహీంపట్నంలో ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు!
Advertisement

Voter List Revision: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) పిలుపులో భాగంగా ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ (SSR) కార్యక్రమంపై బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLA) ఒక ముఖ్యమైన అవగాహన , శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది.

ముఖ్య అతిథుల పిలుపు

Advertisement

ఈ సమావేశానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రత్యేక సమగ్ర సవరణ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ , పరిగి ఎమ్మెల్యే శ్రీ టీ. రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఓటర్ల జాబితాలో దొర్లిన తప్పులను సరిదిద్దడంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) అత్యంత బాధ్యతాయుతంగా, చురుగ్గా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.

Also read: తెలంగాణలో మారిన వాతావరణం.. మరికొన్ని గంటల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు!

Advertisement

క్షేత్రస్థాయి విధివిధానాలపై అవగాహన

ఈ శిక్షణా తరగతులలో బి.ఎల్.ఎ (BLA) ట్రైనర్ చైతన్య కృష్ణారెడ్డి పాల్గొని, ఏజెంట్లకు కావలసిన సాంకేతిక అంశాలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధివిధానాలపై సమగ్రమైన అవగాహన కల్పించారు. ఓటు నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియను క్షేత్రస్థాయిలో ఎలా విజయవంతం చేయాలో వివరించారు.

ప్రజాప్రతినిధులు, నాయకుల హాజరు

ఈ శిక్షణా శిబిరంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు ,పెద్ద సంఖ్యలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs) ఉత్సాహంగా పాల్గొన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×