E-Paper
Advertisement

Mahesh Kumar Goud: ప్ర‌భుత్వంపై భారీ కుట్ర‌లు.. కేటీఆర్ కు శిక్ష తప్పదు… పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

Mahesh Kumar Goud: ప్ర‌భుత్వంపై భారీ కుట్ర‌లు.. కేటీఆర్ కు శిక్ష తప్పదు… పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Mahesh Kumar Goud:  కలెక్టర్ పై దాడిని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. పక్కా పథకం ప్రకారమే కలెక్టర్ పై దాడి జరిగిందని ఆరోపించారు. ఈ కేసులో కేటీఆర్ కు శిక్ష తప్పదని హెచ్చరించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దాడిలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో అధికారం పోయిందనే అక్కసు కేటీఆర్ లో కనిపిస్తుందని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడమే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని ఆరోపించారు.

Also read: దమ్ముంటే అడుగు పెట్టు.. ఆపై మాట్లాడు.. ఇచ్చిపడేసిన షర్మిల

Advertisement

లగచర్లలో భూమిలేని వారు కూడా కలెక్టర్ పై దాడి చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ భారీ కుట్రలు చేస్తోంద‌ని, పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారని అన్నారు. అభివృద్ధి కేంద్రీకరణను బీఆర్ఎస్ అడ్డుకుంటుందని మండిపడ్డారు. కేటీఆర్ ఫోన్ కాల్ సంభాషణలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించినట్టు తెలిపారు. లగచర్ల దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆరే అని స్పష్టం చేశారు. ఈ ఫార్ములా రేస్ లో డబ్బులు చేతులు మారాయని, ప్రభుత్వ సొమ్మును కేటీఆర్ తన వాళ్లకు కట్టబెట్టారని ఆరోపించారు.

కాంగ్రెస్ సర్కార్ ను విజ్ఞప్తి చేస్తున్నానని లగచర్ల దాడి ఘటనలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్టు చేయాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్సవాలలో పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని త‌మ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. డిసెంబర్ 2 లేదా 3వ‌ తేదీన హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధిని ఈ సభ ద్వారా ప్రజలకు వివరిస్తామని అన్నారు. అంతేకాకుండా ఈనెల 16 నుండి జిల్లాలలో పర్యటిస్తానని, కరీంనగర్ జిల్లా నుండి తన పర్యటన మొదలవుతుందని తెలిపారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×