E-Paper
Advertisement

అధికారం పోయాకే గుంటనక్కలు గుర్తుకొచ్చాయా? కవితను ప్రశ్నించిన మహేష్ కుమార్ గౌడ్

అధికారం పోయాకే గుంటనక్కలు గుర్తుకొచ్చాయా? కవితను ప్రశ్నించిన మహేష్ కుమార్ గౌడ్
Advertisement

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామంపై టీపీసీసీ అధ్యక్షులు  మహేశ్ కుమార్ గౌడ్ గాంధీ భవన్‌లో మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. కవితకు రాజకీయ అభినందనలు తెలుపుతూనే గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన వైఫల్యాలను ఎండగట్టారు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చని.. ఆ హక్కు అందరికీ ఉంటుందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కవిత కొత్త ప్రయాణానికి అభినందనలు తెలుపుతూనే గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలను గుర్తు చేశారు. రాష్ట్ర సంపదను బీఆర్ఎస్ నేతలు లూటీ చేస్తున్నప్పుడు కవిత ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆ దోపిడీలో కవితకు సమాన భాగస్వామ్యం ఉందన్న ఆయన.. ఇప్పుడు కేవలం విమర్శలు చేస్తూ తప్పించుకోవాలని చూడటం సరికాదన్నారు. పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించినప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

కేసీఆర్ చుట్టూ గుంటనక్కలు చేరాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పార్టీలో పదేళ్ల పాటు కీలక బాధ్యతల్లో ఉన్న కవితకు అప్పుడు ఆ గుంటనక్కల విషయం తెలియదా అని నిలదీశారు. అధికారం కోల్పోయి ఇంటికే పరిమితమైన తర్వాత కొత్త మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ చుట్టూ ఉన్నది గుంటనక్కలా లేక పందికొక్కులా అన్నది కవితకే బాగా తెలుసని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు రాజకీయ అవగాహన లేదని కవిత చెబుతున్న మాటలు వాస్తవమే కావొచ్చని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎదగాలనే ఆశ ఉండటం సహజమని.. కానీ ఇలాంటి అత్యాశ మాత్రం పనికిరాదని హితవు పలికారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కర్కోటకుడు అని విమర్శించడంపై టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకా లేదా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకా ఆయనను అలా పిలుస్తున్నారని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా కాంగ్రెస్ బలహీనపడదని.. రాబోయే ఎన్నికల్లోనూ హస్తం పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మహేశ్ గౌడ్ విమర్శించారు.

Advertisement

ALSO READ: పార్టీ పెట్టిన మొదటి రోజే.. సీఎంను అంత మాట అంటావా? కవితపై మంత్రి పొన్నం ఫైర్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×