E-Paper
Advertisement

Medaram: మేడారానికి పోటెత్తిన భక్తులు.. సెలవు దినం కావడంతో కిక్కిరిసిన జనం

Medaram: మేడారానికి పోటెత్తిన భక్తులు.. సెలవు దినం కావడంతో కిక్కిరిసిన జనం
Advertisement

Medaram: మేడారం క్షేత్రం భక్తుల జనసందోహంతో పోటెత్తింది. సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న మహా జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని, ముందస్తుగానే తమ ఇష్టదైవాలకు మొక్కులు చెల్లించుకోవాలని వేలాది మంది భక్తులు మేడారం బాట పట్టారు. దీంతో అరణ్య ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో పులకించిపోతోంది.

భక్తులు ముందుగా పవిత్ర జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, తడి బట్టలతోనే వనదేవతల దర్శనానికి క్యూ కడుతున్నారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు తమ మొక్కుల రూపంలో అమ్మవార్లకు ‘నిలువెత్తు బంగారం’ (బెల్లం) సమర్పించి, ధూప దీప నైవేద్యాలతో భక్తిని చాటుకుంటున్నారు. అడవి మార్గాలన్నీ ‘సమ్మక్క-సారలమ్మ’ నామస్మరణతో మారుమోగుతున్నాయి.

Advertisement

మరోవైపు, ప్రతిష్టాత్మకమైన మేడారం జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ములుగు జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ స్వయంగా మేడారంలో పర్యటించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

వాహనాల రాకపోకలు పెరగడంతో మేడారం పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ మళ్లించడం, అదనపు బలగాలను మోహరించడం వంటి చర్యల ద్వారా భక్తుల ప్రయాణం సుఖమంతం అయ్యేలా చూస్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా నేత్రాలను (CCTV) కూడా పటిష్టం చేశారు.

Advertisement

Also Read: గుంటూరులో అర్ధరాత్రి యువకుల వీరంగం.. నడిరోడ్డుపై పొట్టుపొట్టు కొట్టుకున్న బావ-బామ్మర్దులు

కేవలం భద్రత మాత్రమే కాకుండా, భక్తుల మౌలిక వసతులపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎండ వేడిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. మేడారం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ రాజ్ శాఖ చర్యలు తీసుకుంటోంది. వనదేవతల ఆశీస్సుల కోసం వస్తున్న భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×