E-Paper
Advertisement

Keesara Crime: ఆరో తరగతి బాలికపై.. ఇద్దరు అన్నలు, మేనమామ అఘాయిత్యం!

Keesara Crime: ఆరో తరగతి బాలికపై.. ఇద్దరు అన్నలు, మేనమామ అఘాయిత్యం!
Advertisement

Keesara Crime: ఏ హానీ జరగకుండా చూసుకోవాల్సిన వారే ఆ చిన్నారి పాలిట రాక్షసులయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వరుసకు అన్నలయ్యే ఇద్దరు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అది చూసి మందలించాల్సిన మేనమామ కూడా అత్యాచారం జరిపాడు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్​ పరిధిలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

6వ తరగతి చిన్నారి..

కీసర ప్రాంతానికి చెందిన బాధిత చిన్నారి తండ్రికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు సంతానం. చిన్న భార్యకు ఓ కూతురు ఉంది. ఆ బాలిక యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని ఓ ప్రభుత్వ హాస్టల్​ లో ఉంటూ 6వ తరగతి చదువుతోంది. ఇటీవలే సెలవుల కోసం ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేనపుడు వరుసకు అన్నలయ్యే ఇద్దరు ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అది చూసిన మేనమామ అడ్డుకుని వారికి బుద్ది చెప్పాల్సింది పోయి తాను కూడా అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి బాధితురాలు తీవ్ర మానసిక క్షోభకు గురవుతూ వస్తోంది.

Advertisement

Also read: బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

పరార్‌లో ఇద్దరు..

చివరకు పక్కింట్లో ఉంటున్న వారికి జరిగిన విషయం చెప్పింది. వారి ద్వారా విషయం తెలిసి బాధితురాలి కుటుంబ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి నిందితుల్లో ఒకన్ని అరెస్ట్​ చేసినట్టు సీఐ ఆంజనేయులు తెలిపారు. మిగితా ఇద్దరు నిందితులు మహారాష్ట్రకు పారిపోయినట్టుగా తెలిసిందన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నట్టు చెప్పారు. బాధితురాలికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించి నింబోలిఅడ్డలోని బాలికల జువెనైల్​ హోంకు తరలించారు.

Advertisement

Also read: దిగొచ్చిన మోదీ సర్కార్! సిజెపి షరతులన్నింటికీ కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×