E-Paper
Advertisement

Raja Singh : ‘శోభయాత్ర చేపడితే చంపేస్తాం..’ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్‌..

Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. గుర్తు తెలియని నంబర్‌ నుంచి ఫోన్ చేసి బెదిరించినట్లు ఆయన వీడియో రిలీజ్ చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్ర చేపడితే చంపేస్తామంటూ బెదిరించినట్లు తెలిపారు.

Raja Singh : ‘శోభయాత్ర చేపడితే చంపేస్తాం..’ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్‌..
Advertisement

Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఫోన్ చేసి బెదిరించినట్లు ఆయన వీడియో రిలీజ్ చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్ర చేపడితే చంపేస్తామంటూ బెదిరించినట్లు తెలిపారు.

ఫోన్ చేసి బెదిరించడం కాదు.. దమ్ముంటే నేరుగా రావాలని రాజాసింగ్ ఛాలెంజ్ విసిరారు. గతంలో ఇదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజాసింగ్ తెలిపారు. నమ్మిన సిద్దాంతం కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానన్నారు. ఇలాంటి బెదిరింపులు తనను ఏం చేయలేవని తేల్చి చెప్పారు. బెదిరింపులకు పాల్పడే వారు ఎంత స్థాయి వ్యక్తులైనా తనకు అనవసరమన్నారు. దమ్ముంటే నేరుగా రావాలన్నారు. ఫోన్ లు చేయడం మానుకోవాలని రాజాసింగ్ హితువు పలికారు.

Advertisement

బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్‌ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్‌ ఎవరు చేశారనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి యేటా శ్రీరామ నవమి సందర్భంగా రాజాసింగ్‌ శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శోభాయాత్ర చేపట్టవద్దని బెదిరింపు కాల్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×