E-Paper
Advertisement

Thorrur Municipal: తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతల జోరు!

Thorrur Municipal: తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతల జోరు!
Advertisement

Thorrur Municipal: పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం రోజురోజుకు ఉత్సాహంగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పాలకుర్తి శాసనసభ్యులు మామిడాల యశస్విని రెడ్డి మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ప్రతిరోజు పలు వార్డులలో పర్యటిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యే మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు రాయపర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి 13వ వార్డు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

Also Read: MP Crime: ఛీ.. ఛీ.. వాడొక కామాంధుడు.. ఆ వీడియో ఎంత పని చేసింది, ఆపై విధ్వంసం

13 వార్డులో ప్రచారం

Advertisement

ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తొర్రూర్ మున్సిపాలిటీలోని 13 వార్డులో ప్రచారంలో పాల్గొనీ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పట్టణంలోని 13 వార్డులో బిఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమి లేదని అన్నారు. ప్రస్తుతం 13వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బసనబోయిన ఐలమ్మ ను గెలిపిస్తే 13వ వార్డు అభివృద్ధి అంటే ఎలా ఉండాలో చేసి చూపిస్తుందని వారు స్థానికులకు వివరించారు.

పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్

ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడమే ప్రధాన లక్ష్యమని ఈదులకంటి రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు బొమ్మెర కళ్యాణ్ గౌడ్, మండల నాయకులు డిజె శ్రీను, నరసింహుల రామ్మూర్తి, భాస్కర్, బానోత్ రమేష్,తొర్రూరు పట్టణ యూత్ అధ్యక్షుడు బసనబోయిన మహేష్, ఊకల్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు పల్లె దేవేందర్ గౌడ్,మరియు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Mahabubabad Municipal: ఆ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ పీఠం నువ్వా నేనా? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫైట్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×