E-Paper
Advertisement

Telangana : తెలంగాణలో ఎండల నుంచి ఉపశమనం.. 3రోజులపాటు వర్షాలు కురిసే ఛాన్స్..

Telangana :  తెలంగాణలో ఎండల నుంచి ఉపశమనం.. 3రోజులపాటు వర్షాలు కురిసే ఛాన్స్..
Advertisement

Telangana : తెలంగాణలో వారంరోజులుగా ఎండలు దంచేశాయి. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం కూడా అదే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లా దామెరచర్లలో 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత నమోదైంది నల్లగొండలో 42.5 డిగ్రీలు నమోదైంది.

ఒకే గ్రామంలో వడదెబ్బ బారిన పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం కాలనీ గ్రామానికి చెందిన అచ్చె రామారావు , బేతం చిన్ని , తన్నీరు మనోహర్‌ వడదెబ్బతో మృతి చెందారు.

Advertisement

శనివారం నుంచి భానుడు శాంతించనున్నాడు. రాష్ట్రంలో వచ్చే రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రానికి వాయవ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల వచ్చే మూడు రాష్ట్రంలో తూర్పు, దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.హైదరాబాద్‌ చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×