E-Paper
Advertisement

Telangana Group -2: గ్రూప్ -2 పరీక్ష వాయిదా

Telangana Group -2: గ్రూప్ -2 పరీక్ష వాయిదా
Advertisement

Telangana Group -2 Postpone update(Telangana news live):  తెలంగాణ గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఆగస్ట్ 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా పరీక్షలను వాయిదా వేసింది. డీఎస్సీ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌కు వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ కారణంగా గ్రూప్- 2ను వాయిదా వేయాలని నిరుద్యోగుల ఆందోళన క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గ్రూప్ -2 పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. గ్రూప్ -2 పరీక్ష వాయిదాతో పాటు పోస్టుల సంఖ్య పెంచాలని గత నెల రోజులుగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్ నగర్ , దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు పలు రకాలుగా నిరసనలు తెలిపారు. నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల అశోక్‌నగర్‌లో భారీ నిరసన చేపట్టిన అభ్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ సచివాలయం ముట్టడికి కూడా పిలుపునిచ్చారు అభ్యర్థులు.

Advertisement

మొత్తం 783 పోస్టుల భర్తీకి గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం పరీక్ష వాయిదా పడటంతో పోస్టులు కూడా పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 2 వేల పోస్టులు అదనంగా పెంచాలని అంటున్నారు. నిరుద్యోగుల డిమాండ్ నేపథ్యంలో పోస్టులు పెంచుతారా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×