E-Paper
Advertisement

TG Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రంగం సిద్ధం.. 4,800 మంది ప్రముఖులకు ఆహ్వానం

TG Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రంగం సిద్ధం.. 4,800 మంది ప్రముఖులకు ఆహ్వానం
Advertisement

TG Global Summit: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌ 2047’కు రంగం సిద్ధమైంది. ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న ఈ సదస్సు ప్రపంచ స్థాయి దిగ్గజాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ‘తెలంగాణ రైజింగ్‌ థీమ్‌’ తో రాష్ట్రం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రముఖ పరిశ్రమల అధినేతలు, ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లు, సినీ, క్రీడా, విద్యా రంగాలకు చెందిన ప్రముఖులు, విదేశీ రాయబారులు, వివిధ రంగాల నిపుణులను ప్రభుత్వం ఒకే వేదికపైకి తీసుకురానుంది. ఈ సదస్సు తెలంగాణ భవిష్యత్‌ రూపకల్పనకు కీలకం కానుంది.

సదస్సులో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4,800 మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. ఇప్పటికే సుమారు 600 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తమ సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు రోజుల కార్యక్రమంలో 2 వేల మందికి పైగా అతిథులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఒప్పందాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కొత్త ఊపునిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

సదస్సు ప్రధాన లక్ష్యం – 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వృద్ధిని 3 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలపై విస్తృత చర్చాగోష్ఠులు నిర్వహించనున్నారు. పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిష్ణాతులు ఈ చర్చల్లో పాల్గొని తమ సూచనలు, అనుభవాలు పంచుకుంటారు. ఈ ప్రణాళికల రూపకల్పన రాష్ట్ర భవిష్యత్ ప్రగతికి దిశానిర్దేశం చేస్తుంది. ఈ సదస్సులో పలు కీలక అంశాలపై నిపుణులు చర్చించనున్నారు. ముఖ్యంగా కాలుష్య రహితం (నెట్‌ జీరో) సాధించడం, సెమీ కండక్టర్ల పరిశ్రమ అభివృద్ధి, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సామర్థ్యం, నైపుణ్యంతో కూడిన మానవ వనరుల అభివృద్ధి, మహిళల ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వృద్ధి, క్రీడాభివృద్ధి లాంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ రంగాల నిపుణులు తమ అభిప్రాయాలను, విధానాలను తెలియజేస్తారు. వారి అనుభవం రాష్ట్ర ప్రణాళికలకు బలం చేకూరుస్తుంది.

జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అతిథులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తున్నారు. బస, రవాణా, ఇతర లాజిస్టికల్ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మక సదస్సు విజయవంతం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ సమిట్‌ ద్వారా తెలంగాణ ప్రపంచ పటంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశం ఉంది.

Advertisement

ALSO READ: Kadapa Mayor: కడప నగర నూతన మేయర్ ఎన్నిక.. హైకోర్టులో వైసీపీ పిటిషన్..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×