E-Paper
Advertisement

Donated Crores Of Land: తండ్రి కోసం కోట్ల భూమిని దానం చేసిన తనయుడు

Donated Crores Of Land: తండ్రి కోసం కోట్ల భూమిని దానం చేసిన తనయుడు
Advertisement

The son who donated crores of land for his father

Donated Crores Of Land(Local news telangana): నవమాసాలు మోసీ, కనిపెంచిన తమ పిల్లల భవిష్యత్ కోసం ఆస్తులను కూడబెట్టి ఇస్తున్నా సరే..తమ తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు వారి కడుపున పుట్టిన పిల్లలు. అంతేకాకుండా మాకు ఏం ఇచ్చారని కన్నపిల్లలే కొడుతూ.. తిడుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తూ.. వారిని వృద్ధాశ్రమాల్లో చేర్చుతున్నారు. కానీ ఇక్కడ ఓ పుత్రుడు తన తండ్రి సంపాదించిన ఆస్తికోసం పాకులాడలేదు. తన తండ్రి కోసం ఎవరూ చేయని పని చేసి అందరిని షాక్‌కి గురిచేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ఘటనా ఎక్కడ జరిగింది, తండ్రి కోసం ఎంత విరాళంగా ఇచ్చాడనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఇక అసలు వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం హన్మాన్‌ఫారం గ్రామానికి చెందిన కొండపావులూరి శ్రీనివాస్ రావు హైదరాబాద్‌లో ఉంటూ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. మండలంలోని శాఖాపూర శివారులో ఈయన తండ్రి వెంకటేశ్వర్‌రావు సంపాదించిన తొమ్మిది ఎకరాల సాగు భూమి ఉంది. తన తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించాడు.

Read More: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూమోహన్.. వరంగల్ నుంచి పోటీ..

Advertisement

అయితే తన గ్రామంలోని తన భూమిని చనిపోయిన తన తండ్రి జ్ఞాపకార్థం, ఇస్కాన్ సంస్థకు సుమారు రూ.3 కోట్ల విలువగల తొమ్మిది ఎకరాల భూమిని విరాళంగా అందించి తన తండ్రిపై ఉన్న ప్రేమను లోకమంతా చెప్పుకునేలా చాటి చెప్పాడు. అంతేకాదు.. విరాళంగా ఇచ్చిన భూమిలో ఆదివారం శ్రీనివాసరావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణ మందిరం, వృద్ధాశ్రమం, గోశాలతో పాటు ఇతర భవనాల నిర్మాణం కోసం స్థలాన్ని ఇస్కాన్ సంస్థకు అందించినట్లు శ్రీనివాసరావు తెలిపారు.

అనంతరం సొంత నిధులు రూ. లక్షతో స్వగ్రామంలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్‌ ప్రతినిధులు, పలువురు గ్రామస్థులు పాల్గొని శ్రీనివాసరావును అభినందిస్తున్నారు. తమ తల్లిదండ్రులను చూసుకోలేని ఈ కాలంలో ఇంకా ఇలాంటి వాళ్లు అక్కడక్కడ ఉండటం నిజంగా అభినందనీయమని పలువురు గ్రామస్థులు ఇస్కాన్ నిర్వాహకులు కొనియాడారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×