E-Paper
Advertisement

Telangana: తెలంగాణలో ముగిసిన తొలి విడత నామినేషన్లు.. నల్లగొండ జిల్లా టాప్..!

Telangana: తెలంగాణలో ముగిసిన తొలి విడత నామినేషన్లు.. నల్లగొండ జిల్లా టాప్..!
Advertisement

Telangana: పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తొలివిడత 129 చోట్ల సర్పంచి అభ్యర్థులుగా ఒక్కరు చొప్పున మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో ఈ స్థానాలన్నీ ఏకగ్రీవం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. న

4,231 సర్పంచ్‌ పదవులకు 22,330 నామినేషన్లు..
వంబరు 29తో తొలివిడత పంచాయతీలకు నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది. మొత్తం 4,231 సర్పంచి పదవులకు గాను.. సోమవారం నామినేషన్ల పరిశీలన అనంతరం 22,330 మంది మిగిలారు. ఈ పంచాయతీల్లో నామినేషన్ల ఉప సంహరణ తర్వాత ఏకగ్రీవాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది.

Advertisement

నామినేషన్లలో నల్లగొండ జిల్లా టాప్‌..
నల్లగొండ జిల్లాలో 318 పంచాయతీలకుగాను అత్యధికంగా 1,950 మంది సర్పంచ్‌ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. సగటున ఒక్కో పదవికి 6 గురు పోటీ పడుతున్నారు. ములుగు జిల్లాలో అత్యల్పంగా నమోదయ్యాయి. ఇక్కడ 48 పంచాయతీలకు కేవలం 273 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. రాష్ట్రంలోనే ఇది అత్యల్పం.

Also Read: ఢిల్లీలో మంత్రి లోకేష్, పార్టీ ఎంపీలతో భేటీ, సడన్‌గా హస్తిన టూర్ వెనుక

Advertisement

మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో ఖాళీగా మిగిలిన సర్పంచ్‌, వార్డు స్థానాలు
మంచిర్యాల జిల్లాలోని 3 పంచాయతీలతోపాటు 34 వార్డులకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదని ఎస్‌ఈసీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. కొమురంభీమ్‌ జిల్లాలో ఒక సర్పంచ్‌ స్థానంతోపాటు 30 వార్డులకు, నిర్మల్‌ జిల్లాలో ఒక పంచాయతీతోపాటు 7 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. వికారాబాద్‌ జిల్లాలో 19, జనగామ జిల్లాలో 10 వా­ర్డులకు, మరికొన్ని జిల్లాల్లో కూడా కొన్ని వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని ఎస్‌ఈసీ తెలిపింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×