E-Paper
Advertisement

KTR Vs Konda Surekha: అలా మాట్లాడొద్దు.. కొండా సురేఖకు కోర్టు ఆదేశాలు

KTR Vs Konda Surekha: అలా మాట్లాడొద్దు.. కొండా సురేఖకు కోర్టు ఆదేశాలు
Advertisement

KTR Vs Konda Surekha : కేటీఆర్ పిటిషన్‌పై హైదరాబాద్ సిటీ సివిల్‌ కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. కొండా సురేఖపై కేటీఆర్‌ పరువు నష్టం కేసు వేయగా.. ఈ పిటిషన్‌పై  కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధిన వీడియోలను కూడా సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఈ నెల 27 వరకు వాయిదా కోర్టు వేసింది.

మంత్రి కొండా సురేఖ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ మేరకు కొండా సురేఖకు మొట్టికాయలు వేసింది. అంతే కాకుండా కేటీఆర్ పై మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపింది.

Advertisement

కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పుబట్టింది. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. అంతే కాకుండా కేటీఆర్‌పై మంత్రి చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, వెబ్ సైట్లు, మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన , కథనాలను ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలిచ్చింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సమాజంపై చెడు ప్రభావాన్ని చూపుతాయని కోర్టు అభిప్రాయపడింది.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×