E-Paper
Advertisement

Panchayat Elections: కమ్యూనిస్టు కంచుకోటలో తొలిసారి కాంగ్రెస్ జెండా విజయం.. ఆ గ్రామం ఇదే..

Panchayat Elections: కమ్యూనిస్టు కంచుకోటలో తొలిసారి కాంగ్రెస్ జెండా విజయం.. ఆ గ్రామం ఇదే..
Advertisement

నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైంది. దశాబ్దాలుగా ఎర్రజెండాకు అండగా నిలిచిన గరిడేపల్లి మండలం వెల్లిదండ గ్రామంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు.. అంటే దాదాపు 70 ఏళ్లకు పైగా ఆ గ్రామంలో ఎన్నడూ ఎగరని కాంగ్రెస్ జెండా.. ఇప్పుడు సగర్వంగా రెపరెపలాడింది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘనవిజయం సాధించి, కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టారు.

వెల్లిదండ అంటేనే కమ్యూనిస్టు ఉద్యమాలకు నిలయం. గ్రామం ఏర్పడినప్పటి నుండి ఇక్కడ సీపీఐ (CPI), సీపీఎం (CPM), లేదా సీపీఐ ఎంఎల్ (ML) పార్టీల అభ్యర్థులు మాత్రమే సర్పంచులుగా ఎన్నికవుతూ వచ్చారు. ‘వెల్లిదండ అంటే కమ్యూనిస్టు.. కమ్యూనిస్టు అంటే వెల్లిదండ’ అనే నానుడి ఈ ప్రాంతంలో బలంగా ఉండేది. అయితే, ఈసారి జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకున్నారు. అభివృద్ధికి పట్టం కట్టాలనే సంకల్పంతో సంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికారు.

Advertisement

ఈ రసవత్తర ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చనగాని సాంబయ్య తన ప్రత్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. తన సమీప ప్రత్యర్థి, ఎంఎల్-టీఆర్ఎస్ (ML-TRS) కూటమి అభ్యర్థి మేకల కనకారావుపై 328 ఓట్ల ఆధిక్యంతో సాంబయ్య గెలుపొందారు. ఒకప్పుడు కాంగ్రెస్ జెండా ఊపుతూ గ్రామంలో తిరగడమే కష్టంగా ఉండే చోట.. ఏకంగా సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

గతంలో పనిచేసిన సర్పంచుల హయాంలో గ్రామం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని గ్రామస్థులు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో వైఫల్యం, గ్రామాభివృద్ధిలో వెనుకబాటుతనం కారణంగానే తాము ఈసారి పార్టీల కంటే అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని ప్రజలు పేర్కొన్నారు. “గత 70 ఏళ్లుగా ఎందరో నాయకులను చూశాం.. కానీ గ్రామం ఇంకా వెనుకబడే ఉంది. అభివృద్ధి చేద్దామనే ఆలోచనతోనే మార్పును కోరుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం” అని ఓటర్లు స్పష్టం చేశారు.

Advertisement

ఈ విజయం కేవలం ఒక వ్యక్తిది కాదు.. వెల్లిదండ ప్రజల మార్పు ఆకాంక్షకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎట్టకేలకు 70 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టనుండటంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చనగాని సాంబయ్య గెలుపుతో వెల్లిదండలో సరికొత్త అభివృద్ధి అధ్యాయం మొదలవుతుందని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ అసెంబ్లీకి వస్తారో.. రారో చెప్పండి: హరీష్‌పై ఎంపీ చామల ఫైర్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×