E-Paper
Advertisement

Sahithi Infra Scam: రూ.3 వేల కోట్ల భారీ స్కామ్.. ‘సాహితీ’పై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు

Sahithi Infra Scam: రూ.3 వేల కోట్ల భారీ స్కామ్.. ‘సాహితీ’పై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
Advertisement

Sahithi Infra Scam: రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం సృష్టించిన సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ భారీ మోసం కేసులో సీసీఎస్ (CCS) పోలీసులు కీలక ముందడుగు వేశారు. సుమారు నాలుగేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం, ఈ కుంభకోణం విలువ 3 వేల కోట్ల రూపాయలుగా పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్, సైబరాబాద్, మెదక్, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లో వేలాది మంది బాధితుల ఫిర్యాదుల మేరకు ఇప్పటికే 64 కేసులు నమోదయ్యాయి. ఈ భారీ స్కామ్‌కు సంబంధించి పోలీసులు తాజాగా కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

అయితే ఈ మోసం ప్రధానంగా ‘ప్రీ-లాంచ్ ఆఫర్’ పేరుతో జరిగింది. ప్రభుత్వ నిబంధనలైన GHMC, రేరా (RERA) అనుమతులు ఏవీ లేకుండానే, అతి తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామంటూ సాహితీ యాజమాన్యం ప్రజలను నమ్మించింది. కనీసం భూములను పూర్తిగా కొనుగోలు చేయకముందే అడ్వాన్స్‌ల పేరిట వేలాది మంది మధ్యతరగతి ప్రజల నుండి భారీగా పెట్టుబడులు సేకరించింది. తీరా డబ్బులు వసూలు చేసిన తర్వాత ప్రాజెక్టులు చేపట్టకుండా చేతులెత్తేయడంతో బాధితులు రోడ్డున పడ్డారు.

Advertisement

ముఖ్యంగా అమీన్‌పూర్‌లోని ‘శర్వాణి ఎలైట్’ ప్రాజెక్ట్ ఈ కుంభకోణంలో ప్రధాన కేంద్రంగా మారింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ పేరుతోనే సుమారు 17 కేసులు నమోదవ్వగా, కేవలం ఇక్కడే 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల నుండి సేకరించిన మొత్తాన్ని ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయకుండా, మేనేజింగ్ డైరెక్టర్ సాహితీ లక్ష్మీనారాయణ తన సొంత ప్రయోజనాల కోసం, ఇతర వ్యక్తిగత ఆస్తుల కొనుగోలుకు మళ్లించినట్లు అభియోగాలు నమోదయ్యాయి.

Also Read: మంటల్లో పచ్చని కోనసీమ! అసలు ఎలా జరిగింది.. పాయింట్ టు పాయింట్

Advertisement

ప్రస్తుతం ఈ కేసులో లక్ష్మీనారాయణతో పాటు మొత్తం 13 మంది నిందితులపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. పలు కీలక కేసుల్లో ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు కాగా, మరికొన్ని కేసుల్లో విచారణ తుది దశకు చేరుకుంది. త్వరలోనే మిగిలిన కేసుల్లో కూడా ఛార్జ్‌షీట్లు దాఖలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు ఇటువంటి ప్రీ-లాంచ్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×