E-Paper
Advertisement

TGSRTC: మహిళలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీకి మరో 1,085 ఎలక్ట్రిక్ బస్సులు

TGSRTC: మహిళలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీకి మరో 1,085 ఎలక్ట్రిక్ బస్సులు
Advertisement

TGSRTC: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్ఆర్టీసీ)కు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓ జి ఎల్ ) 1085 బస్సులను సరఫరా చేయనుంది. ఒలెక్ట్రా సంస్థకు ఆర్టీసీ లెటర్ అఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) జారీ చేసింది. పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా పర్యావరణ అనుకూల ఇంధన, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్ )ఆధ్వర్యంలో ఈ లేఖను జారీ చేసింది. ఈ సంస్థ తయారు చేసే బస్సులను ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఓ జి ఎల్ సరఫరా చేసే బస్సుల ద్వారా హైదరాబాద్ నగర ప్రజలకు సుస్థిర, పర్యావరణ హితమైన, సమర్ధవంతమైన ప్రజా రవాణా వ్యవస్థను ఆర్టీసీ అందించనుంది. పట్టణాలలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణాను వేగవంతం చేయడానికి కేంద్రం ప్రోత్సహిస్తున్న పీఎం ఈ డ్రైవ్ పథకం హైదరాబాద్ నగరాన్ని విద్యుత్ రవాణా వ్యవస్థ దిశగా మరింత ముందుకు తీసుకెళ్ళనుంది.

Also Read: Marriage Scams: ప్రోఫైల్ చూసి పెళ్లికి రెడీ అయితున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డారండోయ్..?

హైదరాబాద్ కేంద్రంగా..

Advertisement

ఆర్‌టీసీకి ఓలెక్ట్రా 12 మీటర్ల పొడవు ఉన్నలో ఫ్లోర్ బస్సులను సరఫరా చేస్తుంది. ఇందులోఏసీ, నాన్-ఏసీ బస్సులున్నాయి. స్థానిక రోడ్లకు అనుగుణంగా బస్సులను రూపొందించారు. బస్సు ముందు, వెనుక భాగంలో ఆధునిక ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థతో ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణ చేస్తాయి. సుమారు 45 నిమిషాల్లో ఆపర్చునిటీ ఛార్జింగ్ సౌకర్యం ఈ బస్సుల్లో ఉంది. బస్సులో వీల్‌చైర్ వినియోగదారులకు ప్రత్యేక స్థలం కేటాయించారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు ఓలెక్ట్రా నిర్వహిస్తున్నది. సంస్థ వాహనాలు ఇప్పటివరకు 500 మిలియన్ గ్రీన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, కర్బన ఉద్గారాల తగ్గింపులో విశేష పాత్ర పోషిస్తున్నాయి. స్థానిక ఇంజినీరింగ్ నైపుణ్యం, ఆపరేషనల్ విశ్వసనీయత, నిరంతర సాంకేతిక ఆవిష్కరణలతో ఒలెక్ట్రా దేశాన్ని కర్బన ఉద్గార రహితంగా నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

Also Read: Convertible Refrigerators: వేసవిలో కూల్ కూల్.. 2026లో బెస్ట్ రిఫ్రిజరేటర్లు.. ధర, ఫీచర్స్ ఇవే

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×