E-Paper
Advertisement

పక్కన పడేస్తారు? లేక పైసలిస్తారా?.. విద్యుత్ శాఖలో ఏఐ ప్రయోగానికి గండం..!

పక్కన పడేస్తారు? లేక పైసలిస్తారా?.. విద్యుత్ శాఖలో ఏఐ ప్రయోగానికి గండం..!
Advertisement

AI Voicebot: స్వేచ్ఛ బ్యూరో: విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) ఏఐ వాయిస్ బాట్ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అందుకు అంతా సిద్ధం చేసింది. ట్రైనింగ్ కు సంబంధించి పనులు కూడా చేపట్టింది. అంతా రెడీ అయింది. ఇక కొద్దిరోజుల్లో అధికారికంగా ప్రారంభించాలని అనుకునేలోపు ఏఐ వాయిస్ బాట్ కు అడ్డంకులు మొదలయ్యాయి. ఈనెల మొదట్లో లాంఛనంగా ప్రారంభం కావాల్సిన ఏఐ వాయిస్ బాట్ కు ఆదిలోనే బ్రేక్ పడినట్లయింది. సాఫ్ట్ వేర్ నిర్వాహకులకు పేమెంట్స్ అందకపోవడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.

ఈ ప్రక్రియకు బ్రేక్..

ఏఐ వాయిస్ బాట్ విధానం అమల్లోకి వస్తే వినియోగదారులకు ఎనీ టైం సేవలు అందే అవకాశముంది. సంస్థలో సిబ్బంది కొరతను కూడా ఈ సేవల ద్వారా అధిగమించే అవకాశముంది. కానీ సాఫ్ట్ వేర్ నిర్వాహకులకు పేమెంట్స్ చెల్లించకపోవడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడినట్లు సమాచారం. వాయిస్ బాట్ ఆశయం గొప్పదైనా ఆర్థికంగా చిక్కుల కారణంగా ట్రైనింగ్ ప్రక్రియ కూడా నిలిచిపోయినట్లు సమచారం. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న టెక్నికల్ టీమ్స్, సాఫ్ట్‌వేర్ వెండర్లకు పేమెంట్స్ నిలిచిపోవడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ సంస్థలో నెలకొన్న నిధుల కొరత వల్ల టెక్నాలజీ బడ్జెట్‌కు కోత పడిందా? లేక ఇంకా ఎవరైనా అధికారుల హస్తముందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Also Read: సంగారెడ్డి జైల్లో క్రిశాంక్‌ను పరామర్శించిన హరీశ్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు

పక్కకు పడేస్తుందా..?

వాయిస్ బాట్ కు ఆదిలోనే అడ్డంకులు ఎదురవ్వగా.. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన చాట్ బాట్ కూడా అనుకున్న స్థాయిలో పనిచేయడంలేదని సమాచారం. టెక్నికల్ సమస్యల వల్ల కొంత మేర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చాట్ బాట్ సేవలను కూడా మరింత విస్తరించాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాంకేతికత ఎంత అద్భుతంగా ఉన్నా, దానికి తగిన ఆర్థిక మద్దతు లేకపోతే ఎలా విఫలమవుతుందో ఎస్పీడీసీఎల్ ఏఐ వాయిస్ బాట్ ఉదంతం నిదర్శనంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం లేదా సంబంధిత విద్యుత్ సంస్థ వెంటనే కలుగజేసుకుని ఈ ఆర్థిక సమస్యకు పరిష్​కారం చూపిస్తుందా? లేదంటే అత్యాధునిక సాంకేతికతతో తేవాలనుకున్న ఈ వాయిస్ బాట్ ను పక్కకు పడేస్తుందా? అనేది చూడాలి.

Advertisement

Also Read: ఒకటి కాదు రెండు కాదు.. మార్కెట్ ను షేక్ చేయబోతున్న10 క్రేజీ బైక్స్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×