E-Paper
Advertisement

TGSP Constable Row: పది మంది బెటాలియన్ కానిస్టేబుళ్లకు.. ఊహించని షాక్

TGSP Constable Row: పది మంది బెటాలియన్ కానిస్టేబుళ్లకు.. ఊహించని షాక్
Advertisement

TGSP Constable Row: గత కొన్ని రోజులుగా తెలంగాణ స్పెషల్ పోలీసులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.. టీజీఎస్పీ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు, బెటాలియన్ పోలీసుల ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసనలు తెలుపుతున్నారు. “ఒకే రాష్ట్రం- ఒకే పోలీసు విధానం” అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆందోళన చేస్తున్న కానిస్టేబుళ్లపై పోలీసులు కఠిన వైఖరి అవలంబించేందుకు పోలీసు శాఖ సిద్దమైంది. ఆదివారం నాడు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ తరుణంలో తాజాగా తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆందోళనకు దిగిన పది మంది బెటాలియన్ పోలీస్‌ సిబ్బందిని విధుల నుంచి తొలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిస్మిస్‌ అయిన వారిలో మూడో బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ రవికుమార్‌, ఆరో బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ కె.భుషన్‌ రావు, 12వ బెటాలియన్‌కి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణతో పాటు పలువురు ఉన్నారు. వీరందరిని విధుల నుంచి తొలగిస్తూ ఏడీజీ సంజయ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Also Read: జన్వాడ ఫాంహౌజ్ కేసు.. తీగలాగుతున్న పోలీసులు

మరో వైపు ఒకే రాష్ట్రం- ఒకే పోలీసు విధానం అమలు చేయాలంటూ స్పెషల్ పోలీసులు ఆందోళన కొనసాగుతోంది. పలు జిల్లాలో టీజీఎస్పీ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులతో రోడ్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 39 మంది కానిస్టేబుళ్లపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×