E-Paper
Advertisement

TGPSC Group 2: తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

TGPSC Group 2: తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
Advertisement

TGPSC Group 2: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఆదివారం గ్రూప్-2 తుది ఫలితాలు విడుదల చేసింది. కమిషన్ వెబ్ సైట్(https://websitenew.tgpsc.gov.in/) లో ఫైనల్ రిజల్ట్స్ జాబితాను ఉంచింది. మొత్తం 783 పోస్టులకు గానూ 782 మందిని ఎంపిక చేసింది. ఒక పోస్టు ఫలితాన్ని టీజీపీఎస్సీ పెండింగ్ లో పెట్టింది. 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా.. 2024 డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది మార్చిలో జనరల్ ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన అనంతరం ఆదివారం తుది ఫలితాలు విడుదల చేసింది.

మొత్తం 18 పోస్ట్ కోడ్ లకు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-II సర్వీసెస్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షలకు 2025 మార్చి 11న జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేసింది.
అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించింది. ఈ ప్రక్రియ ఆధారంగా, మొత్తం 18 పోస్ట్ కోడ్‌లకు తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను కమిషన్ వెబ్‌సైట్
https://www.tgpsc.gov.in లో సెప్టెంబర్ 28న విడుదల చేసింది. కోర్టులో పెండింగ్ లో ఉన్న వివిధ పిటిషన్ల ఆధారంగా ఫలితాలను విడుదల చేసినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.

Advertisement

అయితే అభ్యర్థి తప్పుడు సమాచారం అందించినట్లు కమిషన్ ఏ దశలో గుర్తించినా ఆ నియామకాన్ని ఏ దశలోనైనా రద్దు చేస్తామని కమిషన్ తెలిపింది.

టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

1. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ లింక్ https://websitenew.tgpsc.gov.in/ పై క్లిక్ చేయండి.
2. హోమ్ పేజీలోని TGPSC గ్రూప్-2 ఫలితం 2025 తాత్కాలిక జాబితా లింక్‌పై క్లిక్ చేయండి.
3. అనంతరం పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
4. ఈ PDFలో అభ్యర్థులు తమ రోల్ నంబర్‌ను చెక్ చేసుకోవచ్చు.
5. తదుపరి అవసరాల కోసం PDF ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, హార్డ్ కాపీని ప్రింట్ తీసుకోండి.

Advertisement

Also Read: CM Revanth Reddy: 10 ఏళ్లు అవకాశం ఇవ్వండి.. ఫ్యూచర్ సిటీ అంటే ఏంటో చూపిస్తా!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×