E-Paper
Advertisement

Tenth Class Results: రేపే టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల.. ఈసారి మారనున్న మార్కుల మెమో..

Tenth Class Results: రేపే టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల.. ఈసారి మారనున్న మార్కుల మెమో..
Advertisement

Tenth Class Results: తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ఫలితాల కోసం ఇటు స్టూడెంట్స్, అటు వారి పేరెంట్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే రేపే టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు రేపు విడుదల కానున్నాయి. ఫలితాలను రేపు విడుద‌ల చేసేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే, ఈసారి పదో తరగతిలో మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గత సంవత్సరం వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్‌ తో పాటుగా క్యుములేటివ్‌ గ్రేడింగ్‌ పాయింట్‌ యావరేజ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

ఇక నుంచి పదో తరగతి మెమోల్లో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. జీపీఏ అనేది తీసివేయనున్నట్టు చెప్పారు. మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా రాత పరీక్ష, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరచనున్నట్టు చెప్పారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్‌ అయ్యారా? అనేది క్లారిటీగా ఇవ్వనున్నారు.

తెలంగాణ మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Advertisement

Also Read: IOCL Recruitment: ఐవోసీఎల్‌లో 1770 పోస్టులు, స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు.. పూర్తి వివరాలివే..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×