E-Paper
Advertisement

Mehdipatnam: ఖమేనీ మృతితో ముస్లింలు ర్యాలీ, నిరసనలు.. అర్ధరాత్రి మెహదీపట్నం‌లో హైటెన్షన్

Mehdipatnam: ఖమేనీ మృతితో ముస్లింలు ర్యాలీ, నిరసనలు.. అర్ధరాత్రి మెహదీపట్నం‌లో హైటెన్షన్
Advertisement

Mehdipatnam: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని మృతికి నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. షియా వర్గానికి చెందిన ముస్లింలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. పెద్దలు, చిన్నారులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి హైదరాబాద్ సిటీలోని మెహదీపట్నం‌ ప్రాంతంలో ముస్లింలు చేపట్టిన ర్యాలీలో హైటెన్షన్ నెలకొంది.

ఖమేనీ మృతితో వివిధ ప్రాంతాల్లో ముస్లింలు ర్యాలీ, నిరసనలు

Advertisement

అమెరికా-ఇజ్రాయెల్ మెరుపుదాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఆయన మృతికి నిరసనగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, ర్యాలీలు చేపట్టారు ముస్లింలు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీలోని మెహిదీపట్నంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. ఆసిఫ్‌నగర్‌ నుంచి మెహిదీపట్నం వరకు చేపట్టిన ర్యాలీలో షియా గ్రూప్ ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ర్యాలీలో ఆందోళనలు చెలరేగే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఖమేని ఫోటోలతో కూడిన ప్లకార్డులు చేత పట్టుకుని నినాదాలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ తీరుపై వారంతా మండిపడ్డారు. నల్ల జెండాలు పట్టుకుని అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రంజాన్ మాసంలో ఖమేని మృతికి తాము శాంతియుతంగా నిరసనలు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

అర్ధరాత్రి మెహదీపట్నం‌లో హైటెన్షన్

ఈ విషయంలో ట్రంప్ ముమ్మాటికీ తప్పు చేశారని ఆరోపించారు. ఖమేనీ మరణానికి సంతాపం తెలిపేందుకు నల్లటి దుస్తులు ధరించిన వందలాది మంది పురుషులు, మహిళలు మరియు పిల్లలు గుమిగూడారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంతటా నిరాశ అలలు అలుముకుంది. ఖతూన్ సమాధి దగ్గర భావోద్వేగ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. నిరసనలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి అమెరికాకు వ్యతిరేక నినాదాలు చేశారు.

ALSO READ: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై స్కోర్ కార్డ్.. సీఎం చేతికి చేరిన సర్వే రిపోర్టు..?

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×