E-Paper
Advertisement

KCR Munugode Meeting : కేసీఆర్ సభపై ఉత్కంఠ.. బీజేపీకి దబిడి దిబిడేనా?

KCR Munugode Meeting : కేసీఆర్ సభపై ఉత్కంఠ.. బీజేపీకి దబిడి దిబిడేనా?
Advertisement

KCR Munugode Meeting : ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరులో కేసీఆర్ బహిరంగ సభ. లక్ష మందితో ధూంధాంగా మీటింగ్. సభను సక్సెస్ చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు సకల ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు భారీ ప్రయత్నాలే జరుగుతున్నాయి. అయితే, మునుగోడు అభివ‌‌ృద్ధికి కేసీఆర్ ఏం హామీలు ఇస్తారనే దానికంటే.. ఫామ్ హౌజ్ ఎమ్మెల్యేల కేసుపై గులాబీ బాస్ రియాక్షన్ ఎలా ఉంటుందనే ఉత్కంఠే ఎక్కువగా కనిపిస్తోంది.

అసలే కేసీఆర్. మామూలుగా మాట్లాడితేనే మాటల మంటలు రాజేస్తారు. పదునైన విమర్శలు చేస్తుంటారు. ఆయన యాస, భాష సూటిగా, స్పైసీగా ఉంటుంది. కొంతకాలంగా బీజేపీపై విరుచుకుపడుతున్న కేసీఆర్.. లేటెస్ట్ మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై ఇంకెంత ఘాటుగా విరుచుకుపడతారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాను లాక్కోవడమే కానీ, తన పార్టీ ఎమ్మెల్యేలను మరొకరు లాగేయాలని చూస్తే కేసీఆర్ ఊరుకుంటారా? ఏకంగా తన ప్రభుత్వాన్నే పడగొట్టాలని చూస్తే గమ్మున ఉంటారా? అందులోనూ ఆ వ్యవహారం అంతా వీడియో, ఆడియోలో చిక్కగా.. పక్కా ఆధారాలతో దొరికిపోగా.. ఇక కేసీఆర్ దూకుడు మామూలుగా ఉండదని అంటున్నారు. ఇప్పటికే పార్టీ నేతలెవరినీ ఈ అంశంపై మాట్లాడొద్దని హెచ్చరించడం.. ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ రోజు నుంచీ ప్రగతిభవన్ లోనే ఉండటం.. వరుస ఆడియో లీకులు, వాట్సాప్ చాట్ లతో వేడి రగిలించడం.. చివరాఖరున ఫినిషింగ్ టచ్ గా మునుగోడు బహిరంగ సభ వేదికగా ఆయన ఖతర్నాక్ స్పీచ్ ఉంటుందని భావిస్తున్నారు. మరి, బీజేపీపై గులాబీ బాస్ ఏ రేంజ్ లో ఫైర్ అవుతారో…

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×