E-Paper
Advertisement

Tension erupts in Siddipet: సిద్ధిపేటలో టెన్షన్ వాతావరణం.. భారీగా మోహరించిన పోలీసులు

Tension erupts in Siddipet: సిద్ధిపేటలో టెన్షన్ వాతావరణం.. భారీగా మోహరించిన పోలీసులు
Advertisement

Tension erupts in Siddipet: గత కొద్ది రోజుల నుంచి సిద్ధిపేటలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య యుద్ధ వాతావరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, నేడు కూడా సిద్ధిపేట పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఇరు పార్టీలు సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. సిద్ధిపేటలోని మైనంపల్లి అంబేద్కర్ చౌక్ లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో పొన్నాల నుంచి పాత బస్టాండ్ కు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా బయలుదేరారు. అక్కడి నుంచి బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు వెళ్లాలనేది కాంగ్రెస్ ప్రణాళిక. అయితే, ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉండడంతో రూట్ మార్చుకోవాల్సిందిగా పోలీసులు లహా ఇచ్చారు. ముందు ఫిక్స్ చేసుకున్న రూట్ లోనే వెళ్తామంటూ కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. ఈ క్రమంలో బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. క్యాంప్ ఆఫీస్ వైపు కాంగ్రెస్ నాయకులు, వారి వాహనాలు వెళ్లకుండా పోలీసులు బారీ కేడ్లను ఏర్పాటు చేశారు.

Advertisement

Also Read: మణికొండపై హైడ్రా కొరడా.. చిత్రపురిలో నిర్మాణాలు కూల్చివేత

ఇటు బీఆర్ఎస్ కూడా రుణమాఫీపై ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో అంతర్గత సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యింది. ఈ సమావేశంలో తాజా, మాజీ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

అయితే, పోటా పోటీగా ఇరు పార్టీల సమావేశాలతో జిల్లాలో రాజకీయ వేడు రాజుకున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇరు పార్టీల కార్యాలయాలు, ప్రధాన కూడలి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. మొత్తంగా సిద్ధిపేటలో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సిద్ధిపేటను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×